సర్వోదయ సాల్వెంట్ కెమికల్​ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం...ఆరుగంటల పాటు చెలరేగిన మంటలు

సర్వోదయ సాల్వెంట్ కెమికల్​ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం...ఆరుగంటల పాటు చెలరేగిన మంటలు

చర్లపల్లి ఇండస్ట్రియల్​ ఏరియాలోని సర్వోదయ సాల్వెంట్ కెమికల్​ ఫ్యాక్టరీలో మంటలను ఎట్టకేలకు ఫైర్​ సిబ్బంది అదుపులోకి తెచ్చారు.  మంగళవారం ( ఫిబ్రవరి 4) రాత్రి భారీ అగ్ని ప్రమాదం సంభవించగా...  5 వతేది తెల్లవారుజామున 3 గంటలకు అదుపులోకి వచ్చాయి.  10 ఫైరింజన్లతో మంటలను అదుపు చేశారు. సుమారు 6 గంటల పాటు మంటలు చెలరేగాయి. 

కెమికల్​ ఫ్యాక్టరీలో రియాక్టర్లు పేలడంతో నాలుగు అంతస్థుల భవనం కుప్పకూలింది.  ఈ ప్రమాదంలో చుట్టు పక్కల పరిశ్రమలకు మంటలు వ్యాపించడంతో .. పక్కనున్న రబ్బర్​ కంపెనీకి మంటలు అంటుకున్నాయి.  దీంతో  పొగ, కెమికల్‌ వాసనతో ఉక్కిరిబిక్కిరైన స్థానికులు   భయాందోళనకు గురయ్యారు. 

Also Read :- హైదరాబాద్‌ టూ తిరుపతి.. ఉదయం 5.30కు వెళ్లాల్సిన విమానం

రాచకొండ సీపీ సుధీర్ బాబు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ప్రమాదానికి కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఫైర్​సిబ్బందికి సూచనలు ఇస్తూ ప్రమాద తీవ్రతను తగ్గించేందుకు ఇటు పోలీసు అధికారులు.. అటు ఫైర్​ సిబ్బంది తీవ్రంగా కష్టపడ్డారు.  ప్రమాదానికి గల కారణాలు, ఎంత ఆస్తి నష్టం జరిగిందనేది తెలియాల్సి ఉంది.