SCO vs OMN: తొలి మ్యాచ్‌లోనే పసికూన బౌలర్ ప్రపంచ రికార్డ్

SCO vs OMN: తొలి మ్యాచ్‌లోనే పసికూన బౌలర్ ప్రపంచ రికార్డ్

ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ లీగ్ లో భాగంగా స్కాట్లాండ్ బౌలర్ సంచలన స్పెల్ తో అదరగొట్టాడు. ఫాస్ట్ బౌలర్ చార్లీ కాసెల్ అరంగేట్ర మ్యాచ్ లోనే ఏడు వికెట్లు తీసి ఔరా అనిపించాడు. ఒమన్ పై జరుగుతున్న మ్యాచ్ లో కాసెల్ ఈ ఘనతను అందుకున్నాడు. దీంతో వన్డే చరిత్రలో  తొలి మ్యాచ్ లోనే ఏడు వికెట్లు తీసుకున్న తొలి బౌలర్ గా ప్రపంచ రికార్డ్ నెలకొల్పాడు. ఇప్పటివరకు ఈ రికార్డ్ సౌతాఫ్రికా పేసర్ కాగిసో రబడా(8-3-16-6) పేరిట ఉంది. 2015 లో బంగ్లాదేశ్ రబడా ఈ ఘనతను సాధించాడు. 

Also Read:-ఆసియా కప్‌లో రికార్డుల మోత.. విధ్వంసకర సెంచరీతో శ్రీలంక కెప్టెన్ సరికొత్త చరిత్ర

వెస్టిండీస్ బౌలర్ ఫిడెల్ ఎడ్వర్డ్స్ (7-1-22-6) సైతం 6 వికెట్లు పడగొట్టాడు. 2003 లో ఎడ్వర్డ్స్ బంగ్లాదేశ్ పై ఈ ఫీట్ సాధించాడు. ఈ మ్యాచ్ లో మొత్తం 5.4 ఓవర్లు బౌలింగ్ వేసిన చార్లీ కాసెల్ 21 పరుగులిచ్చి 7 వికెట్లు పడగొట్టాడు. 12 ఓవర్లో బౌలింగ్ కు దిగిన ఇతను తన తొలి ఓవర్ లోనే మూడు వికెట్లు (జీషన్, అయాన్ ఖాన్, ఖలీద్ కాళీ) వికెట్లు పడగొట్టడం విశేషం. ఈ స్కాట్లాండ్ పేసర్ ధాటికి ఒమన్ 91 పరుగులకే ఆలౌటైంది.

 ఈ మ్యాచ్ విషయానికి వస్తే మొదట బ్యాటింగ్ చేసిన ఒమన్ 21.4 ఓవర్లలో 91 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ అథవాలె 34 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. చార్లీ కాసెల్ 7 వికెట్లు పడగొట్టాడు. లక్ష్య ఛేదనలో స్కాట్లాండ్ విజయం దిశగా కొనసాగుతుంది. 15 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 77 పరుగులు చేసి గెలుపుకు దగ్గరలో ఉంది.