![చార్మినార్ అబ్బాస్ టవర్స్ కూల్చివేయనున్నారా.. కారణం ఏంటీ..](https://static.v6velugu.com/uploads/2025/02/charminar-abbas-tower-demolition-due-to-fire-accident_UFmAnwQDGx.jpg)
చార్మినార్ అంటే షాపింగ్.. మహిళల చీరలు, దుస్తులు, ముత్యాలు ఇలా ఎన్ని ప్రత్యేకలు.. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. ఇతర రాష్ట్రాల నుంచి షాపింగ్ కోసం వస్తుంటారు చార్మినార్ కు.. ఇంట్లో ఏ శుభకార్యం అయినా చార్మినార్ విజిట్ చేయాల్సిందే ఇప్పటికీ.. అలాంటి చార్మినార్ ఏరియాలో బట్టల షాపింగ్ కు ప్రత్యేకంగా ఉన్న అబ్బాస్ టవర్స్.. ఈ టవర్స్ లో 40 నుంచి 50 షాపులు ఉంటాయి. హోల్ సేల్ అండ్ రిటైల్ మార్కెట్ ఉంటుంది. ఇలాంటి అబ్బాస్ టవర్స్ ను ఇప్పుడు కూల్చివేస్తున్నారు అధికారులు.
2025, ఫిబ్రవరి 10వ తేదీ తెల్లవారుజామున మొదలైన మంటలు అదుపులోకి రావటానికి కొన్ని గంటలు పట్టింది. అబ్బాస్ టవర్స్ లో ఫైర్ సేఫ్టీ అనేదే లేదని.. 15 ఫైరింజన్లు వచ్చినా.. సిబ్బంది లోపలికి వెళ్లటానికి దారి కూడా లేదన్నారు ఫైర్ డిపార్ట్ మెంట్ ఆఫీసర్ వెంకన్న. అగ్ని ప్రమాదంలో బిల్డింగ్ బాగా దెబ్బతిన్నదని.. నాలుగో అంతస్తు స్లాబ్ కు పగుళ్లు వచ్చాయని.. బిల్డింగ్ కూలిపోయే ప్రమాదం ఉందని వెల్లడించారు ఫైర్ సేఫ్టీ అధికారులు.
ALSO READ | సారూ ప్రాణాలు పోతున్నాయి... స్పీడ్‌బ్రేకర్ ఏర్పాటు చేయండి..
అబ్బాస్ టవర్స్ చుట్టూ పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి. మంటలు ఆ భవనాలకు వ్యాపించకుండా చర్యలు తీసుకోవటంలో సక్సెస్ అయ్యారు అధికారులు. ఇప్పుడు అబ్బాస్ టవర్స్ ప్రమాదంలో ఉందని.. స్లాబ్ కూలిపోయే ప్రమాదం ఉందని నిర్థారించిన అధికారులు.. దాన్ని కూల్చివేయటానికి రెడీ అయ్యారు. ఇలాగే వదిలేస్తే చుట్టూ ఉన్న భవనాలకు మరింత ప్రమాదం ఉంటుందని.. ఈ క్రమంలోనే అబ్బాస్ టవర్స్ కూల్చివేయాలని ఫైర్ సేఫ్టీ చెబుతోంది. చుట్టు పక్కల భవనాలకు ఇబ్బంది లేకుండా.. ప్రమాదం లేకుండా అబ్బాస్ టవర్స్ భవనం కూల్చివేతకు రెడీ అవుతున్నారు అధికారులు.
అబ్బాస్ టవర్స్ లోని అన్ని షాపులు దుస్తుల వ్యాపారం చేస్తున్నాయని.. వేల కొద్దీ బట్టల సామాగ్రి, చీరలు ఉండటంతో మంటలు అదుపు చేయటం కష్టం అయ్యిందంటున్నారు ఫైర్ సేఫ్టీ అధికారులు. బిల్డింగ్ లోకి ఫైర్ సామాగ్రి తీసుకెళ్లటానికి కూడా సరైన మార్గం లేకపోవటం వల్ల ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉందంటున్నారు ఫైర్ డిపార్ట్ మెంట్ అధికారులు.