
హైదరాబాద్ సిటీ, వెలుగు: చార్మినార్ కు త్వరలోనే రిపేర్లు చేస్తామని ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా(ఏఎస్ఐ)అధికారులు తెలిపారు. ఈ నెల 3న మధ్యాహ్నం భారీ వర్షం కురవడంతో చార్మినార్‌లోని ఓ మినార్‌పై భాగంలో రెండు మీటర్ల మేర పెచ్చులూడిన సంగతి తెలిసిందే.
అక్కడి పరిస్థితిని ఏఎస్ఐ అధికారులు శనివారం పరిశీలించారు. వాతావరణం మారి, ఎండలు పెరగగానే రిపేర్లు మొదలుపెడతామని చెప్పారు. ఈదురు గాలులతో కూడిన అకాల వర్షంతో ఈ ప్రమాదం జరిగిందని, 2019 మే లోనూ ఇలాగే పెచ్చులూడి పడ్డాయని గుర్తు చేశారు. నిపుణులైన ఆర్టిస్టులను పిలిపించి పెచ్చులూడిన భాగాన్ని పునరుద్ధరించే పనులపై చర్చించామని పేర్కొన్నారు.