
ఐపీఎల్ 2025 లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జైత్రయాత్ర కొనసాగుతోంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్.. ఇలా అన్ని విభాగాలలో రాణిస్తూ ప్రత్యర్థులకు దడపుట్టిస్తోంది. ఈ సీజన్ లో అత్యంత సక్సెస్ ఫుల్ టీమ్ గా దూసుకెళ్తూ పాయింట్స్ టేబుల్ టాప్ లోకి వెళ్లిపోయింది. ఆదివారం (ఏప్రిల్ 27) ఢిల్లీపై గెలుపుతో ‘‘ఈ సారి బెంగళూరు ఏదో చేసేలా ఉంది.. కప్ కొట్టేలా ఉంది’’ అన్నట్లుగా గ్రౌండ్ లో సత్తా చాటింది.
ఆర్సీబీకి ట్రోఫీ అందించాలనే కసితో కుర్రాళ్లకంటే కాస్త ఎక్కువే కష్టపడుతున్న కింగ్ కోహ్లీ.. ప్రతి మ్యాచ్ లోనూ స్కోర్ బాధ్యత తన భుజస్కందాలపై వేసుకుని ఇతర బ్యాటర్లను ఎంకరేజ్ చేస్తూ టీమ్ ను ముందుకు తీసుకెళ్తున్నాడు. భారీ స్కోర్ చేయడంలోనూ.. రన్ ఛేజ్ లోనూ సరైన బ్యాటింగ్ ఫౌండేషన్ వేస్తూ పకడ్బందీగా నడిపిస్తున్నాడు.
ఢిల్లీపై భారీ విజయం తర్వాత ఈ ఛేజ్ మాస్టర్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. ఫ్యాన్స్, టీమ్ మేట్స్ ను కూడా ఆలోచింపజేసేలా కీలక వ్యాఖ్యలు చేశాడు కోహ్లీ. ఢిల్లీ ఇచ్చిన 163 లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 26 రన్స్ కే బెంగళూరు 3 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత కోహ్లీ (51), కృనాల్ పాండ్యా (73 నాటౌట్) హ్యూజ్ పార్ట్నర్షిప్ (119 రన్స్) తో అలవోకగా 18.3 ఓవర్లలోనే గెలుపును ఖాతాలో వేసుకుని పాయింట్స్ టేబుల్ లో టాప్ లోకి దూసుకెళ్లింది. ఈ సందర్భంగా కోహ్లీ కీలక వ్యాఖ్యలు చేశాడు.
ALSO READ : ఢిల్లీపై రివేంజ్ తీర్చుకున్న RCB.. 6 వికెట్ల తేడాతో గెలుపు
‘‘రన్ ఛేజ్ లో ఉన్నప్పుడు మేము ట్రాక్ లో ఉన్నామా లేదా అని డగౌట్ ను చెక్ చేస్తుంటాను. నేను చేసే సింగిల్స్, డబుల్స్ కొనసాగిస్తుంటాను. దీనివలన ఇన్నింగ్ స్తబ్దుగా, స్లోగా మారకుండా ముందుకు సాగేందుకు తోడ్పడుతుంది. పార్ట్నర్షిప్ ప్రాముఖ్యత గురించి అందరూ మరిచిపోతున్నారు. బౌలర్స్ ను డామినేట్ చేస్తూ ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్లాలంటే పార్ట్నర్షిప్ చాలా ఇంపార్టెంట్. అందుకే కృనాల్ పాండ్యాతో కలిసి లాంగ్ పాట్నర్షిప్ కొనసాగించాను.
ఛాన్స్ తీసుకుని ఆడతానని, ఎదురుగా నువ్వుంటే చాలు అని కృనాల్ చెప్పాడు. అందుకే స్ట్రైక్ రొటేట్ చేస్తూ కృనాల్ ని ఎంకరేజ్ చేశా. అతనిలో భారీ ఇన్నింగ్స్ ఆడే సామర్థ్యం ఉంది. ఆ తర్వాత మాకు టిమ్ డేవిడ్, జితేశ్ కూడా గుడ్ ఆప్షన్ గా ఉన్నారు. బ్యాక్ ఎండ్ లో వీళ్ల ఫైర్ పవర్ ఇన్నింగ్స్ క్లోజ్ చేయడానికి ఎంతగానో తోడ్పడుతుంది. హెజిల్ వుడ్, భువనేశ్వర్ వరల్డ్ క్లాస్ బౌలర్లు.
స్పిన్నర్లు మిడిల్ ఓవర్లలో అటాక్ చేస్తూ స్కోర్ ను కట్టడి చేస్తుంటారు. గేమ్ ప్లాన్ లో ఇదొక భాగమే. సయాశ్ వికెట్లు తీయకపోయినా డార్క్ హార్స్ లాగా టీమ్ కు ఉపయోగపడుతున్నాడు.’’ అని మ్యాచ్ తర్వాత చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. జట్టు గెలుపులో పార్ట్నర్షిప్ ఎంత కీలకమో.. ఇతర ఆటగాళ్లు ఆ విషయాన్ని ఎలా మర్చిపోతున్నారో చెప్పడం చర్చనీయాంశంగా మారింది.