వాట్సాప్‌లో ఇప్పటికే మెటా ఏఐ సేవలు ఉపయోగిస్తున్నారు చాలామంది. అయితే ఇప్పుడు మరో కొత్త అప్డేట్ వచ్చేసింది. చాట్‌జీపీటీ చాట్‌బాట్‌కు డైరెక్ట్ కాల్ చేసేందుకు ఒక ఫోన్ నెంబర్ని తీసుకొచ్చింది. అది యూఎస్ నెంబర్1–1800–242–8478. ఈ నెంబర్‌కి ఉచితంగా కాల్ చేయొచ్చు. కానీ, ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. అదేంటంటే... ఈ నెంబర్ 24/7 అందుబాటులో ఉండదు. నెలకు15 నిమిషాలు అంటే.. పావుగంట మాత్రమే అందుబాటులో ఉంటుంది. అలాగే మనం కాల్ చేసి ప్రశ్నలు అడగొచ్చు. కానీ, చాట్‌బాట్ నుంచి కాల్స్ రావు.
ప్రశ్న అడిగిన తర్వాత అది మెసేజ్ రూపంలో వస్తుంది. కానీ, చాట్ ప్రారంభించక ముందు మాత్రం ఎటువంటి మెసేజ్‌లు మీకు రావు అని ఓపెన్ ఏఐ సంస్థ హామీ ఇచ్చింది. ప్రస్తుతం ఓపెన్ ఏఐ యూఎస్, కెనడాలోని యూజర్ల కోసం కాలింగ్ సర్వీస్‌ను అందిస్తోంది. అయినప్పటికీ భారత్‌తో పాటు చాట్‌జీపీటీ సపోర్ట్ ఉన్న అన్ని దేశాల్లో వాట్సాప్ చాట్‌బాట్‌ను ప్రయత్నించొచ్చు. అలా ప్రయత్నించినప్పుడు మన ఫీడ్‌లో చాట్‌బాట్‌ను యాక్సెస్ చేస్తుంది. దీంతో పాటు వాట్సాప్‌లో పంపే మెసేజ్‌ల సంఖ్య లిమిటెడ్‌గా ఉంటుంది. డైలీ లిమిట్ పూర్తి కాగానే కంపెనీ ఆ విషయాన్ని తెలియజేస్తుంది.
అంతేకాకుండా చాట్‌జీపీటీ కోసం వాట్సాప్ చాట్‌బాట్ సపోర్ట్ ఉన్న ఫీచర్ల పరంగా కూడా కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. మెసేజింగ్ యాప్‌లో చాట్‌జీపీటీతో మాత్రమే టెక్స్ట్ చాట్లు చేయగలరు అని కంపెనీ చెప్తోంది. కానీ, త్వరలో మీరు చాట్‌జీపీటీ సెర్చింగ్, ఫొటోలతో చాట్ చేయడం, అన్ని కాన్వర్జేషన్ మెమరీ లాగ్‌ను కలిగి ఉండడం వంటి బెనిఫిట్స్ ఉంటాయి. నెంబర్ ఉంది కదా అని చాట్‌జీపీటీని వాట్సాప్ గ్రూప్‌లో యాడ్ చేయాలనుకుంటే మాత్రం వీలుకాదు.