మన సమస్యలకు సొల్యుషన్ చెప్పే ChatGPT కే సమస్య వస్తే..!

మన సమస్యలకు సొల్యుషన్ చెప్పే ChatGPT కే సమస్య వస్తే..!

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.. చాట్ జీపీటీ బ్రేక్ డౌన్ అయ్యింది. ప్రపంచ వ్యాప్తంగా సర్వర్ ప్రాబ్లమ్ తో కంటెంట్ క్రియేటర్లు, యూజర్లు ఇబ్బంది పడ్డారు. 2024, డిసెంబర్ 12వ తేదీ ఉదయం 7 గంటల సమయంలో.. చాట్ జీపీటీ AI సర్వీర్లు డౌన్ కావటంతో.. ప్రపంచ వ్యాప్తంగా కోట్ల మంది వినియోగదారులు తికమక పడ్డారు. ఈ విషయాన్ని ఎక్స్ ద్వారా పోస్టులు పెట్టారు. చాట్ జీపీటీకి మెయిల్స్ చేశారు. సమస్యను గుర్తించిన యాజమాన్యం.. పరిష్కారం దిశగా ప్రయత్నిస్తున్నట్లు నోట్ రిలీజ్ చేసింది. 

చాట్ జీపీటీలో ఒకే సమస్య కాదు.. పలు సమస్యలు ఎదుర్కొంటున్నట్లు యూజర్లు కంప్లయింట్స్ రైజ్ చేస్తున్నారు. కొంత మందికి లాగిన్ సమస్య వస్తే.. మరికొంత మందికి కంటెంట్ రిప్లయ్ రావటం లేదని చెబుతున్నారు. కొంత మందికి అసలు చాట్ జీపీటీ ఫ్లాట్ ఫాం ఓపెన్ కావటం లేదనే యూజర్లు చేస్తున్న కంప్లయింట్..

ఓవరాల్ గా లక్షకు పైగా కంప్లయింట్స్ రైజ్ కావటంతో.. కంపెనీ స్పందించింది. వీలైనంత త్వరగా సమస్యకు పరిష్కారం చూపిస్తామని.. యూజర్లు ఓపిగ్గా ఉండాలని కోరింది. ఒక్క చాట్ జీపీటీనే కాదు.. ఈ ఏడాది ఫేస్ బుక్, ఇన్ స్ట్రాగ్రామ్ సైతం పలుసార్లు డౌన్ అయ్యాయి. రోజురోజుకు టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందుతున్నా.. అప్పుడప్పుడు ఇలాంటి సమస్యలు రావటం యూజర్లను ఆగ్రహానికి గురి చేస్తుంది.