ChatGPT OpenAI సంచలన నిర్ణయం..కోఫౌండర్ ఆల్ట్ మన్ తొలగింపు.. తాత్కాలిక సీఈవోగా మీరా మురాటి

చాట్ జీపీటీ ChatGPT  మాతృ సంస్థ ఓపెన్ ఏఐ(Opent AI) సీఈవో, సహ వ్యవస్థాపకుడు సామ్ ఆల్ట్ మాన్ ఆ సంస్థ కీలక బాధ్యతలనుంచి తప్పుకున్నారు. సీఈవో పదవికి ఆల్ట్ మన్ రాజీనామా చేశారు. ఈ ఊహించని పరిణామం టెక్ రంగంలో పెద్ద సంచలనంగా మారింది. సంస్థకు నాయకత్వం వహించే ఆల్ట్ మన్ సామర్థ్యంపై Open AI బోర్డుకి విశ్వాసం లేదని ఆ కంపెనీ శుక్రవారం బ్లాగ్ లో పోస్ట్ చేసింది. ఆల్ట్ మన్ సామర్థ్యంపై బోర్డులో చర్చించాక ఆల్ట్ మన్ ను తొలగించినట్లు తెలిపింది. బోర్డు వ్యవహారాల్లో ఆల్ట్ మన్ తీరు బాగాలేదని, ఇది అతని బాధ్యతల నిర్వహణకూడా సరిగా లేదని బోర్డు తెలిపింది. ప్రస్తుతం తాత్కాలిక సీఈవోగా మీరా మురాటి బాధ్యతలు నిర్వహించనున్నారు. 

AI విప్లవంలో ప్రముఖ వ్యక్తిగా పరిశ్రమను రూపొందించడంలో కీలక ప్రభావాన్ని చూపిన వ్యక్తిగా ఆల్ట్ మన్ నిష్క్రమణ అందరికీ ఆశ్చర్యం కలిగించింది. Chat GPTని ప్రవేశపెట్టినప్పటి నుంచి ప్రధాన టెక్ కంపెనీలు, Open AI తో పోటీ పడేందుకు ఎంతో  ప్రయత్నించాయి. ప్రపంచ స్థాయి కంపెనీలు, నేతలు ఆల్ట్ మన్ వ్యూహాలు, ఇన్వెస్ట్ మెంట్ ను కోరుకున్నారు. 

సిలికాన్ వ్యాలీలో ఆల్ట్  మన్ తెలివిగల పెట్టుబడిదారుడిగా, చిన్న కపెంనీలకు మద్దతుదారుగా గుర్తింపు పొందారు. Opent Ai అభివృద్ధి.. ఆల్ట్ మన్ ను ఎలాన్ మస్క్, మెటా సీఈవో మార్క్ జుకర్ బర్గ్ వంటి టెక్ టైటాన్స్ స్థాయికి చేర్చింది. గతవారం ఆల్ట్ మన్ సంస్థ ప్రారంభ సమావేశంలో ఉత్సాహభరితమైన డెవలపర్ లకు Opent AI రోడ్ మ్యాప్ ను అందించారు. 

ALSO READ :- Telangana Tour : ఈ వీకెండ్ అందాల లోకం ఆదిలాబాద్ చూసొద్దామా..