ChatGPT లో కొత్త ఫీచర్..హిస్టరీని సెర్చ్ చేయొచ్చు.. ఎలాగంటే..

ChatGPT లో కొత్త ఫీచర్..హిస్టరీని సెర్చ్ చేయొచ్చు.. ఎలాగంటే..

OpenAI ChatGPT యాప్, వెబ్ వెర్షన్ కి కొత్త ఫీచర్ అందిస్తోంది.  2024 ప్రారంభలో AI  ఎనేబుల్ ఫీచర మెమరీని పరిచయం చేసిన విషయం తెలిసిందే. అయితే ఇది అన్ని చాట్ లలో చర్చించే విషయాలను స్టోర్ చేసేందుకు పవర్ చార్ బాట్ ఫంక్షనాలిటీ ఉపయోగకరంగా ఉన్నప్పటికీ కస్టమర్ల చాట్ లను వెదికేందుకు  అనుమ తించలేదు. 

దీనిని దృష్టిలో పెట్టుకొని Open AI వెబ్ లోని ChatGPT  కస్టమర్లకోసం కొత్త ఫీచర్ ను తీసుకొచ్చింది. అదే చాట్ హిస్టరీ ఫీచర్. దీని ద్వారా చాట్ హిస్టరీని ఈజీగా సెర్చ్ చేయొచ్చు. 

గత ChatGPT ఎలా సెర్చ్ చేయొచ్చంటే..

గత చాట్లను సెర్చ్ చేసేందుకు వెబ్బ్రౌజర్ లో  ChatGPT ని ఓపెన్ చేయాలి. ఎడమ సైడ్ బార్ నుంచి Search magnifying glass ని క్లిక్ చేయాలి. Windows లో అయితే Ctrl+K లేదా Mac లో అయితే cmd+k ని ఉపయోగించవచ్చు. 

ఆ తర్వాత.. గత చాట్లను గుర్తించే కీలక పదాలను పదబంధాన్ని  టైప్ చేయాలి. ChatGPT మీ చాట్ లను ఐటెంటిఫై చేస్తుంది. తద్వారా మీ చాట్ ను తిరిగి మళ్లీ చదువుకోవచ్చు. ఇక్కడ మరో బెనిఫిట్ ఏమిటంటే.. ఆర్వైవ్ చేనినప్పటికీ సైడ్ బార్ లో కనిపించనప్పటికీ వాటిని శోధించవచ్చు. 

OpenAI సెర్చ్ చాట్ హిస్టరీ ఫీచర్ ప్రస్తుతం ప్లస్ , టీమ్ మెంబర్లకు అందుబాటులోకి వస్తోంది. ఎంటర్‌ప్రైజ్ , ఎడ్యు యూజర్లు వారంలోగా దీన్ని పొందుతారని చెప్పా రు. వచ్చే నెలలో ఉచిత వినియోగదారులందరికీ అందుబాటులో ఉంటుంది.