డాక్టర్ల కంటే Chat GPT బాగా చెబుతుందా?.. ఆ యూనివర్సిటీ రిపోర్టులో నిజమెంత?

 డాక్టర్ల కంటే Chat GPT బాగా చెబుతుందా?.. ఆ యూనివర్సిటీ రిపోర్టులో నిజమెంత?

చాట్ జీపీటీ.. ఇది ఇప్పుడు సాంకేతిక రంగంలో ఓ సంచలనం. ఎన్నో రకాల సందేహాలకు సమాధానం ఇస్తున్న చాట్ జీపీటీ.. ఇప్పుడు ఆరోగ్య సంరక్షణకు సంబంధిత ప్రశ్నలకు చక్కటి సమాధానం ఇస్తోంది. ఎంతలా అంటే మానవులతో సమానంగా ఆరోగ్య సంరక్షణ సంబంధిత ప్రశ్నలకు సమాధానం చెపుతోందని ఓ అధ్యయనం వెల్లడించింది. చాట్‌బాట్‌లు రోగులతో హెల్త్‌కేర్ ప్రొవైడర్ల కమ్యూనికేషన్‌లకు ప్రభావవంతమైన మిత్రులుగా ఉండగలదని సూచిస్తోంది. 

న్యూయార్క్ యూనివర్సిటీ పరిశోధకులు 18 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయసున్న 392 మందిని 10 రోగికి సంబంధించిన ప్రశ్నలు సంధించి ప్రతిస్పందనలను తీసుకున్నారు. సగం ప్రశ్నలను ఆరోగ్య సంరక్షణ ప్రదాతలు, మిగిలిన ప్రశ్నలు OpenAI  చాట్‌బాట్ ChatGPT ద్వారా రూపొందించారు. అయితే ఈ అధ్యయనంలో చాట్ బాట్, మానవ ఆరోగ్య సంరక్షణ దాతల  సమాధానాల మధ్య తేడా లేదని గుర్తించారు. అయితే కంటెస్టెంట్ లు ChatGPT రూపొందించిన ప్రతిస్పందనలపై తక్కువగా విశ్వసించారు. 

JMIR మెడికల్ ఎడ్యుకేషన్‌లో ప్రచురించబడిన అధ్యయనం, చాట్‌బాట్, మానవ-ఉత్పత్తి ప్రతిస్పందనల మధ్య తేడా కనుగొన్నారు. సగటున పాల్గొనేవారు 65.5%  చాట్‌బాట్ ప్రతిస్పందనలను , 65.1%  ప్రొవైడర్ ప్రతిస్పందనలను సరిగ్గా గుర్తించారు.  వివిధ ప్రశ్నలకు 49.0% నుంచి 85.7% వరకు ఉంటుంది. దాదాపుగా చాట్ జీపీటీ, ప్రొవైడర్ల ప్రతిస్పందనలు ఒకేలా ఉన్నాయి. రోగనిర్ధారణ, చికిత్స సలహాలు అత్యల్ప ట్రస్ట్ రేటింగ్‌ కలిగి ఉన్నాయి .

పరిశోధకుల అభిప్రాయం ప్రకారం.. అడ్మినిస్ట్రేటివ్ పనులు, దీర్ఘకాలిక వ్యాధి నిర్వహణకు సంబంధించిన రోగి-ప్రదాత కమ్యూనికేషన్‌లో చాట్‌బాట్‌లు సహాయపడగల అవకాశం ఉందని అధ్యయనంలో వెల్లడైంది. NYU టాండన్ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ ,గ్రాస్‌మాన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ పరిశోధకులు చాట్‌బాట్‌లు మరింత క్లినికల్ పాత్రలను తీసుకోవడం గురించి మరింత పరిశోధన అవసరమని పేర్కొన్నారు. అయితే చాట్‌బాట్ రూపొందించిన సలహాలను క్యూరేట్ చేసేటప్పుడు ప్రొవైడర్లు జాగ్రత్త గా ఉండాలని వారు గుర్తించారు.