
ఛత్తీస్‌గఢ్‌లో మావోయి స్టుల ఏరివేత కొనసాగు తున్నది. బీజాపూర్ జిల్లా ధర్మతాళ్లగూడెం అటవీ ప్రాంతంలో మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య ఈ రోజు ( ఏప్రిల్ 24) ఉదయం నుండి ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు మావోయిస్టులు మరణించారు. మావోయిస్టులు ఉన్నారన్న సమాచారంతో ధర్మతాళ్లగూడెం అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు, స్థానిక పోలీసులు సంయుక్తంగా గాలింపు చేపట్టారు.
పోలీసులకు తారసపడిన మావోయి స్టులు.. కాల్పులు జరిపారు. ప్రతిగా భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు అక్కడి కక్కడే మృతిచెందారు. ఈ ప్రాంతంలో ఇంకా గాలింపు కొనసాగుతున్న దని అధికారులు వెల్లడించారు. మృతుల సంఖ్యమ మరింత పెరిగే అవకాశం ఉన్నది.మరోవైపు తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ సరీహద్దుల్లోని ములుగు జిల్లా వాజేడు, వెంకటాపురం నూగూరు మండలాల తోపాటు....భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల పరిధిలోని కర్రెగుట్టల్లో మావోయిస్టుల కోసం భద్రతా బలగాల కూంబింగ్ కొనసాగుతున్నది. 3 వేల మందికిపైగా పోలీస్ బలగాలు, సీఆర్పీఎఫ్, కోబ్రా దళాలు అడవుల్లో గాలింపు చర్యలు చేపట్టాయి.
మావోయిస్టు కీలక నాయకుడు హిడ్మా దళం కోసం గాలింపు చేస్తున్నట్టు తెలుస్తున్నది. పోలీసులు ‘బచావో కర్రెగుట్టలు’ పేరుతో స్పెషల్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. 250 కిలోమీటర్ల మేర విస్తరించిన కర్రెగుట్టలను వేలాదిమంది బలగాలు పూర్తిగా ఆధీనంలోకి తీసుకున్నట్టు తెలుస్తున్నది. మావోయిస్టుల కదలికల ప్రచారం, పోలీసుల కూంబింగ్‌తో ఏజెన్సీలో ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది.
వెంకటాపురం,నూగూరు,కస్తూర్బా పాఠశాల ఆవరణ లో భద్రతా బలగాల అధికారులు రెండు హెలికాప్టర్లలో మోహరించారు. హెలిప్యాడ్ వైపు వెళ్లేందుకు ఎవరినీ అనుమతించకుండా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. అటవీ ప్రాంతంలో హెలికాప్టర్లు తిరుగుతున్నాయని, కాల్పుల శబ్దాలు కూడా వినిపిస్తున్నాయని, ములుగు ప్రాంతంలో ఇంత పెద్ద స్థాయిలో కూంబింగ్ నిర్వహించడం ఇదే తొలి సారి అని సమీప గామాల ప్రజలు చెప్తున్నారు.