- చత్తీస్గడ్ లోని కాంకేర్ జిల్లాలో ఘటన
భద్రాచలం, వెలుగు: చత్తీస్గడ్ కాంకేర్ జిల్లాలో శుక్రవారం ఎన్కౌంటర్ జరిగింది. కాక్నార్-కుర్కుంజ్అడవుల్లో కూంబింగ్‌కు వెళ్లిన డీఆర్జీ, సీఆర్పీఎఫ్, ఎస్టీఎఫ్ జవాన్లను టార్గెట్ గా చేసుకుని మావోయిస్టులు కాల్పులు జరిపారు. జవాన్లు సైతం ఎదురుదాడికి దిగి కాల్పులు జరుపుకుంటూ ముందుకెళ్లడంతో మావోయిస్టులు అడవుల్లోకి పారిపోయారు. ఘటనా స్థలం నుంచి భారీగా ఆయుధాలు, పేలుడు సామగ్రి స్వాధీనం చేసుకున్నారు. స్థానికంగా అన్ని స్టేషన్లను అలర్ట్ చేశారు. కూంబింగ్ ముమ్మరం చేసినట్టు బస్తర్ఐజీ సుందర్రాజ్ పి తెలిపారు.