పెట్టుబడికి డబ్బుల్లేక ఇంట్లోనే ఉరేసుకున్న రైతు

ఆదిలాబాద్ జిల్లా తాడిహత్నూర్ కు చెందిన చౌహన్ అరవింద్ అనే రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. వ్యవసాయ పెట్టుబడికి డబ్బులు అందక... మనస్థాపంతో ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. బ్యాంకులో జమ అయిన రుణమాఫీ డబ్బులను అప్పు కింద బ్యాంక్ సిబ్బంది కట్ చేసుకున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. పంట పెట్టుబడికి డబ్బులు లేకపోవడంతో... సూసైడ్ చేసుకున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు.