ఉచిత బ్యూటీషియన్ కోర్సును సద్వినియోగం చేసుకోవాలి : వెన్ రెడ్డి రాజు

చౌటుప్పల్, వెలుగు : చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలో ఏర్పాటు చేసిన ఉచిత బ్యూటీషియన్ కోర్సును మహిళలు సద్వినియోగం చేసుకోవాలని మున్సిపాలిటీ చైర్మన్ వెన్ రెడ్డి రాజు సూచించారు. సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలోని షాదీఖానాలో అభయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత బ్యూటీషియన్ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ  బ్యూటీషియన్​ కోర్సు సుమారు 45 రోజులపాటు కొనసాగుతుందని, ఈ కార్యక్రమాన్ని మహిళలు వినియోగించుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో అభయ ఫౌండేషన్ యూత్ ఎంపవర్​మెంట్ డాక్టర్ మూర్తి, కో–ఆర్డినేటర్ మంగ, బ్యూటిషన్ టీచర్ మహేశ్వరి  తదితరులు పాల్గొన్నారు.