
- కాచిగూడలో తిలకించిన 200 మంది మెడికల్ స్టూడెంట్లు
- ఉప్పల్‌లో మరో 250 మంది..
బషీర్‌బాగ్/మేడిపల్లి, వెలుగు : ఛత్రపతి శివాజీ కొడుకు శంభాజీ జీవిత కథ ఆధారంగా తెరకెక్కించిన ఛావా సినిమాను గాంధీ, ఉస్మానియా మెడికల్స్టూడెంట్స్తిలకించారు. ఆదివారం రెండు మెడికల్‌కాలేజీలకు చెందిన సుమారు 200 మంది స్టూడెంట్స్కాచిగూడ లోని ఐనాక్స్ కు తరలివచ్చారు. ఈ సందర్భంగా సనాతన ధర్మ సేన వ్యవస్థాపకుడు డా. కొప్పుల రాజశేఖర్ గుర్రంపై వచ్చి ఆకట్టుకున్నారు.
డాక్టర్లు సినిమా చూస్తున్నంత సేపు ‘జై భవాని , జై శివాజీ’ అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. ప్రముఖ చిన్నపిల్లల డాక్టర్గుండ్లూరు సురేందర్ బాబు, ఇతర డాక్టర్లు పాల్గొన్నారు. అలాగే పీర్జాదిగూడ నుంచి సుమారు 250 మంది..ఆర్కే యువభారత్ ఫౌండేషన్ చైర్మన్ కన్నెబోయిన రాము యాదవ్ తో కలిసి ర్యాలీగా ఉప్పల్ ఏషియన్ థియేటర్‌కు వచ్చి సినిమా చూశారు. ఫౌండేషన్ వ్యవస్థాపకులు గీత, నిర్వాహకులు శ్రీనివాస్, స్వామి, మహేశ్, బీజేపీ రాష్ట్ర లీడర్ఏనుగు సుదర్శన్ రెడ్డి పాల్గొన్నారు.