సినీ ప్రియులకు క్రేజీ న్యూస్.. తెలుగులోకి బాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ ‘ఛావా’

సినీ ప్రియులకు క్రేజీ న్యూస్.. తెలుగులోకి బాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ ‘ఛావా’

బాలీవుడ్ బాక్సాపీస్‌‌‌‌ వద్ద బ్లాక్‌బస్టర్‌‌‌‌‌‌‌‌ కలెక్షన్స్‌‌‌‌తో దూసుకెళుతున్న హిందీ చిత్రం ‘ఛావా’ త్వరలో తెలుగులోనూ విడుదల కాబోతోంది. గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్స్ ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. మార్చి 7న తెలుగు వెర్షన్‌‌‌‌ను రిలీజ్ చేయబోతున్నట్టు బుధవారం ప్రకటించారు. ఛత్రపతి శివాజీ మహరాజ్ పెద్ద కొడుకు శంభాజీ మహరాజ్‌‌‌‌ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం ఈనెల 14న విడుదలై రికార్డు స్థాయి వసూళ్లు రాబడుతోంది.  

శంభాజీగా విక్కీ కౌశల్ నటించగా, ఆయన భార్య యేసుబాయి భోంస్లేగా రష్మిక మందన్న నటించింది. ఔరంగజేబుగా అక్షయ్ ఖన్నా నటించాడు.  డయానా పెంటీ జినత్,  అశుతోష్ రాణా, దివ్య దత్త ఇతర పాత్రలు పోషించారు. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించగా దినేశ్‌‌‌‌ విజన్ నిర్మించారు. హిందీ వెర్షన్‌‌‌‌కు తెలుగు రాష్ట్రాల్లోనూ చక్కని ఆదరణ లభిస్తుండగా ఇప్పుడు తెలుగులోనూ అందుబాటులోకి వస్తోంది.