ఛాయాసోమేశ్వర ఆలయ అభివృద్ధికి ప్రణాళికలు

ఛాయాసోమేశ్వర ఆలయ అభివృద్ధికి ప్రణాళికలు

నల్గొండ అర్బన్, వెలుగు : పట్టణంలోని పానగల్​లో ఛాయాసోమేశ్వరాలయ అభివృద్ధికి భవిష్యత్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు రాష్ట్ర పురావస్తుశాఖ డైరెక్టర్ లక్ష్మి స్పష్టం చేశారు. గురువారం నల్గొండలోని ఛాయా సోమేశ్వర ఆలయాన్ని ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ గంట్ల అనంతరెడ్డి ఆధ్వర్యంలో ఆమెకు పూర్ణకుంభంతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు చేయించారు. 

ఈ సందర్భంగా లక్ష్మి మాట్లాడుతూ ఛాయా సోమేశ్వర ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు తనవంతు కృషి చేస్తానని తెలిపారు. ఆమె వెంట రాష్ట్ర పురావస్తు శాఖ ఉన్నతాధికారులు నారాయణ, రాములునాయక్, నాగరాజు, నాగలక్ష్మి, నర్సింగ్ నాయక్, సోమశేఖార్ రెడ్డి, కౌన్సిలర్ రజితాయాదయ్య, దేవాదాయ శాఖ ఈవో బాలకృష్ణ పాల్గొన్నారు.