వైద్యం అందక అవస్థలు .. సీహెచ్​సీల్లో వైద్య సిబ్బంది కొరత

వైద్యం అందక అవస్థలు .. సీహెచ్​సీల్లో వైద్య సిబ్బంది కొరత
  • సకాలంలో వైద్యం అందక రోగులకు ఇక్కట్లు
  • డాక్టర్లు లేక సిబ్బందే వైద్యం చేస్తున్న వైనం
  • పట్టించుకోని జిల్లా ఉన్నతాధికారులు

హాస్పిటల్స్​ స్థాయి పెరిగినా అందుకు అనుగుణంగా సిబ్బందిని నియమించకపోవడంతో వైద్యం కోసం వచ్చిన పేషెంట్లు ఇబ్బందిపడుతున్నారు. హాస్పిటల్​కు డాక్టర్​రాకపోతే మరో హాస్పిటల్​ నుంచి డిప్యూటేషన్​పై పంపి వైద్యసేవలకు అంతరాయం కలగకుండా చూస్తున్నారు.  రెగ్యూలర్​ డాక్టర్​ లేకపోవడంతో ఉన్న వైద్యులకు ఇక్కట్లు తప్పడంలేదు.  అంతేకాకుండా వైద్యం కోసం వస్తున్న పేదలకు వైద్య సేవలు అందకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  ఆర్థిక స్తోమత ఉన్నవారు ప్రైవేట్​ హాస్పిటల్స్​కు వెళ్తున్నారు. 


 కామారెడ్డి, పిట్లం, వెలుగు:  పిట్లం మండల కేంద్రంలోని సీహెచ్​సీ హాస్పిటల్ వైద్య విధాన పరిషత్​లో కొనసాగుతోంది.  ఈ 30 పడకల హాస్పిటల్​లో ఐదుగురు డాక్టర్లకుగాను ఒకరిని డిప్యూటేషన్​పై నియమించగా  మరొక డెంటిస్ట్​ఉన్నారు. సూపరింటెండెంట్​గా  ఎల్లారెడ్డి హాస్పిటల్​ సూపరింటెండెంట్​కు బాధ్యతలు అప్పగించారు.    ట్రీట్మెంట్​కోసం పిట్లం, పెద్దకొడప్​గల్​, నిజాంసాగర్​ మండలంలోని వారితో పాటు,  పక్కనున్న సంగారెడ్డి జిల్లా సరిహద్దు​ గ్రామాల రోగులు వస్తారు.  కనీసం రోజుకు 80 నుంచి 100 మంది వరకు వైద్యం కోసం వస్తారు. 

 డాక్టర్లు లేకపోవటంతో సిబ్బందే​ట్రీట్మెంట్​ చేయాల్సి పరిస్థితి నెలకొంది. గత్యంతరం లేక కొందరు ప్రైవేట్​హాస్పిటల్​కు వెళ్తున్నారు.  ఇటీవల ఓ వ్యక్తి జ్వరం వచ్చిన తన బిడ్డకు ట్రీట్మెంట్​ కోసం హాస్పిటల్​కు వస్తే డాక్టర్లు లేకపోవటంతో ప్రైవేట్​హాస్పిటల్​కు తీసుకెళ్లాడు.   డాక్టర్లు లేని హాస్పిటల్​ ఎందుకంటూ మెయిన్​ గేట్​కు అడ్డంగా  తోపుడు బండ్లు పెట్టి  ఆ తండ్రి నిరసన తెలిపాడు.  ప్రజలకు వైద్యసేవలు అందాలన్న లక్ష్యంతో రూ. 10.70 కోట్ల వ్యయంతో కొత్త బిల్డింగ్​ నిర్మాణం పనులు చేపట్టారు.  నిధుల కొరతతో నిర్మాణంనిలిచిపోయింది.  కాగా ఆయా సీహెచ్​సీల్లో మొత్తం 20 మందికి గాను ఏడుగురు మాత్రమే ఉన్నారు. 

ALSO READ : వాల్టా చట్టానికి పదును..చెరువుల రక్షణకు సర్కారు చర్యలు

సిబ్బంది కొరతతో..

బిక్కనూరు పీహెచ్​సీలో ముగ్గురు డాక్టర్లకు గాను ఒకరిని మాచారెడ్డికి, మరొకరిని పుల్కల్ పీహెచ్​సీకి  డిప్యూటేషన్​పై పంపారు.   నిజాంసాగర్​  పీహెచ్​సీ డాక్టర్​కు పెద్దకొడప్​గల్​ ఇన్​చార్జి బాధ్యతలు అప్పగించారు.   బిక్కనూరులో ఐదు ఏఎన్ఎం పోస్టులు,  స్టాప్​ నర్సు, ల్యాబ్​ టెక్నిషియన్​ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.   సిబ్బంది కొరతతో  వైద్య సేవలకు అంతరాయం కలుగుతోంది. 

జ్వరాల విజృంభణ  

జిల్లా వ్యాప్తంగా విష జ్వరాలు విజృంభిస్తున్నాయి.   డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్​తో పాటు,  చికెన్​ గున్యా, సీజనల్​ జ్వరాలతో వందలాది జ్వరపీడితులు ఉన్నారు.   40 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి.    గవర్నమెంట్​ హాస్పిటల్స్​లో వైద్యసేవలందక గత్యంతరం లేని పరిస్థితులో కొందరు ప్రైవేట్​ హాస్పిటల్స్​కు వెళ్తున్నారు.   సీహెచ్​సీలను అప్​గ్రేడ్​ చేసి వైద్య విధాన పరిషత్ లోకి చేర్చటంతో పాటు 30 పడకల హాస్పిటల్స్​గా మార్చారు.   ఇందుకు అనుగుణంగా డాక్టర్ల నియమాకం జరగలేదు.  ఉన్నతాధికారులు చొరవ చూపి సమస్యను పరిష్కరించాల్సిన అవసరముంది.

వైద్య సేవలందిస్తున్నాం

సీహెచ్​సీల్లో డాక్టర్ల కొరత ఉన్న దృష్ట్యా  జిల్లా, ఏరియా హాస్పిటల్​నుంచి డిప్యూటేషన్​పై డాక్టర్లను పంపి వైద్యసేవలందిస్తున్నాం.  రోగులకు ఇబ్బందులు రాకుండా చూస్తున్నాం.   ఏవరైన డ్యూటీ డాక్టర్​ రాకపోతే మరో హాస్పిటల్​ నుంచి డాక్టర్​ను  పంపిస్తున్నాం. 

డాక్టర్​ విజయలక్ష్మీ, డీసీహెచ్​ఓ, కామారెడ్డి జిల్లా