పంజాగుట్టలో కేఏపాల్‌పై చీటింగ్‌ కేసు నమోదు

పంజాగుట్టలో కేఏపాల్‌పై చీటింగ్‌ కేసు  నమోదు

ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏపాల్‌పై చీటింగ్‌ కేసు నమోదైంది.  కేఏపాల్‌పై చీటింగ్‌ కేసు నమోదు చేశారు పంజాగుట్ట పోలీసులు. రంగారెడ్డి జిల్లాలోని జిల్లెలగూడకు చెందిన యస్.కిరణ్ కుమార్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఎల్బీనగర్‌ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే టికెట్ ఇస్తా అని చెప్పి కేఏ పాల్ తన దగ్గర రూ. 50 లక్షలు తీసుకున్నాడని కిరణ్ కుమార్ తన ఫిర్యాదులో తెలిపారు.  

ఇందులో రూ.30 లక్షలు ఆన్‌లైన్‌, మిగిలినవి పలు దఫాలుగా నగదు ఇచ్చినట్లుగా బాధితుడు పేర్కొన్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.   కాగా.. ఈ నెల 13న జరిగిన ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో కేఏపాల్ విశాఖపట్నం ఎంపీగా పోటీ చేసిన విషయం తెలిసిందే. తానే గెలవబోతున్నట్టు పాల్ విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.