జీడిమెట్ల, వెలుగు: ఎలాంటి పర్మిషన్లు లేకుండా ఫేక్లైసెన్స్తో డ్రగ్స్తయారు చేస్తున్న ఫార్మా కంపెనీపై జీడిమెట్ల పోలీసులు చీటింగ్, ఫోర్జరీ కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. జీడిమెట్ల, సుభాష్‌నగర్ ప్లాట్ నంబర్ 318లోఓవాయిడ్ ఫార్మా లిమిటెడ్పేరుతో నర్సపల్లి రాముడు అనే వ్యాపారస్తుడు ఫార్మా కంపెనీ నడుపుతున్నాడు.
డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా, ఫోర్జరీ లైసెన్స్‌తో డ్రగ్స్తయారు చేస్తున్నాడు. డ్రగ్కంట్రోల్అధికారులు శనివారం దాడులు నిర్వహించి రూ.23.93లక్షల విలువ చేసే 800 కిలోల డ్రగ్స్స్వాధీనం చేసుకున్నారు. వారి ఫిర్యాదుతో జీడిమెట్ల పోలీసులు కేసు నమోదు చేశారు.