ఖమ్మం మాజీ డీసీపీ సుభాష్ చంద్రబోస్ పై చీటింగ్ కేసు నమోదు

నలుగురికి మంచి చెడులు చెప్పాల్సిన ఓ పోలీసు అధికారే దారి తప్పాడు.  రూల్స్ పాటించకుండా ప్రభుత్వాన్ని మోసం చేసేందుకు ప్రయత్నించాడు ఖమ్మం లా అండ్ ఆర్డర్ మాజీ డీసీపీ సుభాష్ చంద్రబోస్. అనుమతి పొందిన దానికి భిన్నంగా ఇంటి నిర్మాణం చేపట్టారని చంద్రబోస్ పై ఖమ్మం హవేలి పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు నమోదయింది. మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సురభి ఫిర్యాదుతో ఆయనపై 420 కింద చీటింగ్ కేసు రికార్డ్ చేశారు. 

ప్రభుత్వాన్ని తప్పు దోవ పట్టించి.. సర్కార్ ఆదాయానికి గండి కొట్టారని మున్సిపల్ కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సుభాష్ చంద్రబోస్ తోపాటు ఆయన భార్య, కుమారుడిపై కూడా కేసుపెట్టారు.