భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు: నెంబర్ ప్లేట్స్ లేకుండా తిరిగే వెహికల్స్‌పై చీటింగ్ కేసులు నమోదు చేస్తామని కొత్తగూడెం డీఎస్పీ రెహమాన్ పేర్కొన్నారు. ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాల మేరకు డీఎస్పీ పరిధిలో శుక్రవారం ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు.
ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ కొత్తగూడెం త్రీ టౌన్ పీఎస్పరిధిలో నెంబర్ ప్లేట్లు లేకుండా తిరుగుతున్న ఇద్దరిపై, వన్ టౌన్‌పరిధిలో ముగ్గురిపై చీటింగ్ కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. కొందరు నేరస్తులు నెంబర్ ప్లేట్స్ లేని వెహికల్స్‌తో తిరుగుతూ దొంగతనాలకు పాల్పడుతున్నారన్నారు. నేరాల నియంత్రణకు పోలీసులు చేస్తున్న ప్రయత్నాలకు ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. స్పెషల్ డ్రైవ్‌లో వన్ టౌన్, త్రీ టౌన్ సీఐలు కరుణాకర్, శివప్రసాద్, ట్రాఫిక్ ఎస్ఐలు నరేశ్, మదార్, సిబ్బంది పాల్గొన్నారు.