చిట్టీల పేరుతో రూ.4 కోట్ల చీటింగ్.. దంపతులు పరార్..

చిట్టీల పేరుతో రూ.4 కోట్ల చీటింగ్.. దంపతులు పరార్..
  • నిందితుల ఇంటి ముందు బాధితుల ఆందోళన

జీడిమెట్ల, వెలుగు: చిట్టీలు, వడ్డీల పేరుతో మోసం చేసిన దంపతుల ఇంటిని బాధితులు ముట్టడించారు. కుత్బుల్లాపూర్​ వెంకటేశ్వర నగర్​కు చెందిన మేకల నాగమునయ్య, నాగమణి దంపతులు. తమ బంధువులు చేకూరి రంగనాయకులు, గురుస్వామితో కలిసి వీరు చిట్టీలు, వడ్డీ వ్యాపారం మొదలుపెట్టారు.

వీరిని నమ్మి సుమారు 34 మంది బాధితులు చిట్టీలు వేయడంతోపాటు లక్షల రూపాయలు వడ్డీకి ఇచ్చారు. ఆ తర్వాత ఆ డబ్బులు సుమారు రూ.4.15 కోట్లతో ఏప్రిల్​ నెలలో పరారయ్యారు. దీంతో బాధితుల అదే నెలలో సైబరాబాద్ ఈవోడబ్ల్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. నెలలు గడుస్తున్నా తమకు న్యాయం జరగడం లేదని నాగమునయ్య ఇంటిని బాధితులు గురువారం ముట్టడించారు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో వెనుదిరిగారు. పోలీసులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు.