కోరుట్ల మండలం ధర్మారం శివారులోని పెద్దవాగుపై రెండేండ్ల కింద చెక్‌డ్యాం నిర్మించారు. దీని నిర్మాణానికి రూ.3 కోట్లు ఖర్చయింది. ఇటీవల కురిసిన వానలకు చెక్‌డ్యామ్ పూర్తిగా కొట్టుకపోయింది. గతేడాది వర్షాకాలంలోనూ ఓ సారి కొట్టుకుపోగా రూ.60లక్షలతో చెక్‌డ్యాం కట్టను తిరిగి నిర్మించారు. మళ్లీ ఇటీవల పడ్డ వానలకు చెక్‌డ్యాం కొట్టుకుపోగా, పక్కనున్న పొలాలు కోతకు గురయ్యాయి.
రెండేండ్లలో 2 సార్లు చెక్‌డ్యాం కొట్టుకపోవడంతో కోట్ల రూపాయలు ప్రజాధనం వృథా అయిందని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంజినీర్లు సూచించిన ప్లేస్‌లో కాకుండా కాంట్రాక్టర్ తన సొంత లాభం కోసం వేరే ప్రాంతంలో నిర్మించడంతోనే చెక్‌డ్యాం కొట్టుకుపోయిందని రైతులు ఆరోపిస్తున్నారు.
- కోరుట్ల రూరల్, వెలుగు