సప్పుడు చేస్తే తొక్కించుడే

సప్పుడు చేస్తే తొక్కించుడే
  • సైలెన్సర్లతో భారీ శబ్ధం చేస్తున్నNiz వాహనాలకు చెక్ 
  • రోడ్ రోలర్ సాయంతో 122 సైలెన్సర్ల ధ్వంసం 
  • సైలెన్సర్ పెట్టిన వాహనాలన్నీ సీజ్ 

నిబంధనలకు విరుద్ధంగా టూ వీలర్ వెహికల్స్ కు సైలెన్సర్లు తొలగించి భారీ శబ్ధంతో రోడ్డు మీదకి వచ్చి ఇతరులను ఇబ్బంది పెడుతున్న వారిపై నగర పోలీసులు కొరడా ఝళిపించారు. సైలెన్సర్లతో శబ్ధం చేస్తున్న వెహికల్స్ ను సీజ్ చేసి.. సైలెన్సర్లను రోడ్డు రోలర్ తో తొక్కించారు. నిజామాబాద్ నగరంలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించిన ట్రాఫిక్ పోలీసులు  122 పైగా సైలెన్సర్లను పట్టుకుని రోడ్ రోలర్ తో తొక్కించారు.  ద్విచక్రవాహనాల సైలెన్సర్లు మార్పు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కంపెనీతో వచ్చిన సైలెన్సర్లను మాత్రమే వాడాలని వాటిని ఎలాంటి మార్పు ఊరుకునేది లేదని హెచ్చరించారు. 

మార్పు చేసిన మెకానిక్ లపై కూడా క్రిమినల్ చర్యలు తీసుకుంటామని నిజామాబాద్ ట్రాఫిక్ ఏసీపీ టి. నారాయణ అన్నారు. నిజామాబాద్ ఎఎస్పీ శేషాద్రిని రెడ్డి, ఐపీఎస్ ట్రెయినీ బి. చైతన్య రెడ్డి. జిల్లా రవాణాశాఖాధికారి జె. ఉమా మహేశ్వరరావు, ట్రాఫిక్ సీఐ వి. వెంకట్ నారాయణ ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు.

వెలుగు, ఫొటో గ్రాఫర్