మెట్రో రైలు సౌండ్​ పొల్యూషన్​కు త్వరలో చెక్

మెట్రో రైలు సౌండ్​ పొల్యూషన్​కు త్వరలో చెక్
  • ప్రజావాణి ఫిర్యాదుకు స్పందన 

పద్మారావునగర్, వెలుగు : సికింద్రాబాద్​లోని​బోయిగూడ వైజంక్షన్ వద్ద మెట్రో రైలు సౌండ్​పొల్యూషన్​కు త్వరలో చెక్ పడనుంది. మూల మలుపు వద్ద మెట్రో రైలు చేస్తున్న భారీ శబ్దానికి స్థానిక అపార్ట్​మెంట్ వాసులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయమై మెట్రో అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా స్పందించలేదు. దీంతో ఏప్రిల్​12న హైదరాబాద్​ కలెక్టరేట్​లో జరిగిన ప్రజావాణిలో అపార్ట్ మెంట్ వాసులు తమ సమస్యను వివరించారు.

ఎట్టకేలకు స్పందించిన అధికారులు మెట్రో రైలు శబ్ద కాలుష్య నివారణకు తక్షణ చర్యలు తీసుకోవాలని పీసీబీతో పాటు సిటీ సీపీకి ఆదేశాలు ఇచ్చారు. ఈ క్రమంలో అపార్ట్ మెంట్ వాసుల స్టేట్ మెంట్​ను బుధవారం రికార్డు చేశారు. మెట్రో పట్టాల లైన్​కు  ఇరువైపుల నాయిస్​ బారియర్స్​ఏర్పాటు చేయాలని అపార్ట్ మెంట్ ప్రెసిడెంట్​హనుమండ్లు అధికారులను కోరారు. ఇదే విషయాన్ని పేర్కొంటూ ఎల్​అండ్​టీ మెట్రోకు పోలీస్​అధికారులు లేఖ రాశారు.