గ్యాస్ సిలిండర్ ధరల సవరింపు: ఇంట్లో వాడే గ్యాస్ ధరలు పెరిగాయా.. తగ్గయా..?

గ్యాస్ సిలిండర్ ధరల సవరింపు: ఇంట్లో వాడే గ్యాస్ ధరలు పెరిగాయా.. తగ్గయా..?

న్యూఢిల్లీ: గ్యాస్ వినియోగదారులకు చమురు మార్కెటింగ్ కంపెనీలు బిగ్ షాక్ ఇచ్చాయి. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధరలను రూ.6 మేర పెంచాయి. ప్రతి నెల ఒకటో తేదీన గ్యాస్ ధరలను చమురు మార్కెటింగ్ కంపెనీలు సవరిస్తుంటాయి. ఇందులో భాగంగానే 2025, మార్చి 1వ తేదీన గ్యాస్ ధరల తేదీల్లో సవరింపులు చేస్తూ.. కమర్షియల్ సిలిండర్ ధరను రూ.6 హైక్ చేశాయి. 

అయితే 14.2 కిలోల దేశీయ ఎల్పీజీ సిలిండర్ల ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు చోటు చేసుకోలేదు. దేశీయ ఎల్పీజీ సిలిండర్ల ధరలు స్థిరంగా ఉన్నాయి. 2024, ఆగస్ట్ నుంచి 14.2 కిలోల దేశీయ ఎల్పీజీ సిలిండర్ల ధరల్లో ఎలాంటి మారలేదు. ఈ నెల కూడా ఇంట్లో వినియోగించే గ్యాస్ ధరలు పెరగకపోవడంతో గృహా వినియోగదారులు ఊపిరి పీల్చుకున్నారు. 

19 కిలోల గ్యాస్ ధరలు ప్రాంతాల వారీగా:
 

  • ఢిల్లీ – రూ. 1,803
  • కోల్‌కతా – రూ. 1,913
  • ముంబై – రూ. 1,755.50 
  • చెన్నై – రూ. 1,965.50

14.2 కిలోల గ్యాస్ ధరలు ప్రాంతాల వారీగా:
 

  • ఢిల్లీ – రూ. 803
  • కోల్‌కతా – రూ. 829
  • ముంబై – రూ. 802.50
  • చెన్నై – రూ. 818.50
  • లక్నో - రూ. 840.50
  • హైదరాబాద్- రూ.855