Household Hints & Tips : ఇంటికి తాళం వేసే ముందు ఒకటికి రెండు సార్లు వీటిని చెక్ చేసుకోండి.. మర్చిపోవద్దు..!

Household Hints & Tips : ఇంటికి తాళం వేసే ముందు ఒకటికి రెండు సార్లు వీటిని చెక్ చేసుకోండి.. మర్చిపోవద్దు..!

సిటీ లైఫ్.. ఎప్పుడూ ఏదో ఒక హడావుడి.. ఏదో ఒక పనిలో బిజీ బిజీ. పిల్లలను స్కూల్ కు పంపించి భార్యా భర్తలు ఇద్దరూ ఆఫీస్ కు వెళ్లటం.. ఏదైనా కోచింగ్ కి వెళ్లటం.. షాపింగ్, ఫంక్షన్స్.. ఇలా ప్రతిరోజూ బైటికి వెళ్తూనే ఉంటుంటారు. ఇప్పుడు విల్లేజ్ లలో కూడా ఇదే పరిస్థితి. అయితే బయటకు వెళ్లే ముందు హౌజ్ హోల్డ్స్ ఈ టిప్స్ తప్పనిసరి. ఎందుకో మీరే చదవండి.

ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు తాళం వేశారో, లేదో మరొక్కసారి చూసుకోవాలి. తాళాన్ని లాగి చూసి ఒక్కసారి కన్ఫార్మ్ చేసుకోవాలి.

 కంప్యూటర్ షట్ డౌన్ చేసిన తర్వాత, స్విచ్ కూడా ఆపాలి. ఆపింది లేనిది మరోసారి చూసుకోవడంలో తప్పు లేదు.

 రోజూ ఆఫీసుకు బయల్దేరే ముందు బ్యాగ్ లో ఏఏ వస్తువులు ఉన్నాయో.. రోజు అవసరాలను బట్టి బ్యాగ్ ను సర్దుకున్నారో లేదు చెక్ చేసుకోవాలి.

 కారు, టూ వీలర్ వాడే వాళ్లు, వాటిని ఉపయోగించే ముందు తప్పనిసరిగా పెట్రోల్ ఎంత ఉందో చూసుకోవాలి. ఎంతదూరం వస్తుందో అంచనా వేసు కోవాలి.

 ఇంటి నుంచి బయటకు వెళ్లే ముందు పర్స్ ఉందో లేదో, దానిలో ఎన్ని డబ్బులు ఉన్నాయో తప్పక చూసుకో వాలి.

 రాత్రి పడుకునే ముందు ఇంట్లో ఉన్న గ్యాస్, స్విచ్చులు, వాటర్ ట్యాప్ లు, ఫ్రిజ్ వంటి అన్నింటిని ఒకసారి గమనించాలి.

 ఎవరితోనైనా ఫోన్ మాట్లాడిన తర్వాత అవతలి వాళ్లు కట్ చేస్తారులే అని ఊరుకోకూడదు.. ఒకసారి కచ్చితంగా చూసుకోవాలి.

 హైదరాబాద్ వంటి నగరాల్లోనే కాదు జిల్లా కేంద్రాల్లోనూ బస్ ఎక్కిన తర్వాత, దిగిన తర్వాత పర్స్, సెల్ ఫోన్, బంగారం వంటి విలువైన వస్తువులు ఉన్నాయో లేదో చూసుకో వాలి.

 బ్యాంకు, పోస్టాఫీసు వంటి కార్యా లయాల్లోనే కాదు ఎక్కడైనా సరే ఒక దరఖాస్తు నింపిన తర్వాత తప్పనిసరిగా మరోసారి అన్నీ సరిగా ఉన్నాయో, లేదో గమనించాలి.

 ఈ మధ్య ఎక్కువ మంది చేస్తున్న పనేంటంటే... సెల్ ఫోన్ లో  వివిధ మాధ్యమాలలో వచ్చిన మెసేజ్ లు చూడకుండా, చదవకుండా ఫార్వర్డ్ చేస్తున్నారు. అలా చేయడం వల్ల అనవసరమైన సమస్యలు వస్తాయి. కాబట్టి ఏదైనా మెసేజ్ మరొకరికి పంపాలనుకుంటే ముందు తప్పనిసరిగా చూడాలి.