గొంతునొప్పితో బాధపడుతున్నారా.. అయితే ఈ డ్రింక్స్ ఓసారి ట్రై చేయండి

గొంతునొప్పితో బాధపడుతున్నారా.. అయితే ఈ డ్రింక్స్ ఓసారి ట్రై చేయండి

వానలు ఆగకుండా పడుతుండటంతో చాలా మంది జలుబు, గొంతునొప్పి వంటి సమస్యలతో బాధపడుతున్నారు. అసలే కరోనా ఉన్న ఈ కాలంలో వీటిని త్వరగా తగ్గించుకోవడం చాలా ముఖ్యం. దీనికోసం ఎప్పుడూ మందులపైనే ఆధారపడకుండా ఇంట్లోనే కొన్ని రకాల డ్రింక్స్‌‌ చేసుకుని తగ్గించుకోవచ్చు. గొంతునొప్పి, ఒళ్లు నొప్పులు వంటివి తగ్గడంలో సాయపడే కొన్ని డ్రింక్స్‌‌ ఇవి.

అల్లం టీ

ప్రతి వంటింట్లో ఉండే అల్లంతో తయారు చేసే టీ తాగితే గొంతు నొప్పి క్రమంగా తగ్గుతుంది. అయితే దీనికి ఫ్రెష్‌ అల్లాన్నే వాడాలి.
అందుబాటులో ఉంటే, అప్పుడే పైన కాడతోసహా తవ్వితీసిన అల్లాన్ని వాడితే మరింత మంచిది. దీనిపైన సన్నని వేళ్లలాగా ఉంటాయి. వీటిని కడిగి చిన్నచిన్న ముక్కలుగా కట్‌‌ చేసి వాడుకుంటే బెటర్‌‌‌‌. ఇది దొరకని వాళ్లు మామూలు అల్లాన్నే వాడుకోవచ్చు.

కావాల్సినవి: అల్లం తరుగు, మంచి నీళ్లు: ఒక లీటర్‌‌‌‌, తేనె: ఒక టేబుల్ స్పూన్‌‌, నిమ్మ చెక్కలు: రెండు,
తయారీ: అల్లం చెక్కు తీసి, సన్నగా తరగాలి. ఒక పాన్‌‌లో లీటర్‌‌‌‌ నీళ్లు వేడిచేసి, తరిగిన అల్లం వేసి సన్నని మంట మీద పది నిమిషాలు ఉడికించాలి . తర్వాత దించి, ఇందులో నిమ్మరసం, తేనె కలిపి వేడిగా కప్పులో పోసుకుని తాగితే చాలు.

చికెన్‌‌–లెమన్‌‌ సూప్‌‌

గొంతునొప్పి, జలుబు, దగ్గు వంటివి ఉన్నప్పుడు భోజనం చేయాలనిపించదు. పైగా డైజెషన్‌‌ ప్రాబ్లమ్స్‌‌ కూడా వస్తాయి. ఇలాంటి టైమ్‌‌లో అటు ఎనర్జీని ఇస్తూ, ఇటు హెల్త్‌‌ ప్రాబ్లమ్స్‌‌ను తగ్గించడంలో సాయపడే డ్రింక్స్‌‌ తీసుకుంటే బెటర్‌‌‌‌. నాన్‌‌ వెజిటేరియన్స్‌‌ అయితే చికెన్‌‌ సూప్‌‌ చేసుకుని తాగితే మంచిది. అందులో లెమన్‌‌ యాడ్‌‌ చేసుకుంటే మరింత బాగా పనిచేస్తుంది. ఇలాంటి టైమ్‌‌లో చికెన్‌‌ కర్రీ తినడం కంటే సూప్‌‌ చేసుకుని తాగితే, త్వరగా క్యూర్‌‌‌‌ అవుతుంది.

కావాల్సినవి

బోన్‌‌లెస్‌‌ చికెన్‌‌: 50 గ్రాములు

అల్లం–వెల్లుల్లి పేస్ట్‌‌: అర టీ స్పూన్‌‌

కొత్తిమీర తరుగు: ఒక టేబుల్‌‌ స్పూన్‌‌

నిమ్మకాయ: నాలుగు చెక్కలు, ఫ్రెష్‌‌ క్రీమ్‌‌: ఒక టేబుల్‌‌ స్పూన్‌‌, బటర్‌‌: అర టీ స్పూన్‌‌

పసుపు: అర టీ స్పూన్‌‌, గ్రీన్‌‌ చిల్లీ పేస్ట్‌‌: అర టీ స్పూన్‌‌, కార్న్‌‌ఫ్లోర్‌‌‌‌: ఒక టీ స్పూన్‌‌

ఉప్పు: తగినంత, నీళ్లు: 180 మిల్లీ గ్రాములు

తయారీ

చికెన్‌‌ను చిన్నచిన్న ముక్కలుగా కట్‌‌ చేసుకోవాలి. ఒక పాన్‌‌లో నీళ్లు వేడి చేసి, అందులో చికెన్‌‌ ముక్కలు వేయాలి. ఇందులోనే అల్లం–వెల్లుల్లి పేస్ట్‌‌, పసుపు, కొత్తిమీర, గ్రీన్‌‌ చిల్లీ పేస్ట్‌‌, క్రీమ్‌‌, బటర్‌‌‌‌, నాలుగు చెక్కల నుంచి తీసిన నిమ్మరసం, తగినంత ఉప్పు వేసి మరికొద్ది సేపు ఉడకనివ్వాలి. ఇదే టైమ్‌‌లో సూప్‌‌ చిక్కదనం కోసం కార్న్‌‌ఫ్లోర్‌‌‌‌ కూడా కలపాలి. లో ఫ్లేమ్‌‌ మీద ఐదు నిమిషాలు ఉడకనిచ్చి, దించేస్తే చికెన్‌‌–లెమన్‌‌ సూప్‌‌ రెడీ. దీన్ని వేడిగా ఉన్నప్పుడు తాగితే మంచి ఫలితం ఉంటుంది.

సినెమన్‌‌–ఆల్మండ్‌‌ మిల్క్‌‌

యాంటీ ఆక్సిడెంట్స్‌‌ పుష్కలంగా ఉండే సినెమన్ (దాల్చినచెక్క)తో గొంతు సంబంధిత సమస్యలు తగ్గిపోతాయి. దీనికి ఆల్మండ్‌‌ మిల్క్‌‌ కూడా యాడ్‌‌ అయితే మరింత బాగా పనిచేస్తుంది.

కావాల్సినవి

ఆల్మండ్‌‌ మిల్క్‌‌: ఒక కప్పు

దాల్చినచెక్క పొడి: అర టీ స్పూన్‌‌

బేకింగ్‌‌ సోడా: కాస్తంత

తేనె: ఒక టేబుల్‌‌ స్పూన్‌‌

తయారీ

పాన్‌‌ వేడి చేసి అందులో దాల్చిన చెక్క పొడి, బేకింగ్ సోడా వేసి కలపాలి. వెంటనే బాదంపాలు పోసి, ఆ రెండింటి మిశ్రమంలో పాలల్లో కలిసేలా కలుపుతూనే ఉండాలి. చిన్న పొంగు వచ్చే వరకు ఉడికించి దించాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక కప్పులోకి తీసుకుని, అందులో తేనె కలపాలి. అంతా బాగా కలిశాక వేడిగా తాగితే మంచిది.

For More News..

స్థానిక సంస్థల ఎన్నికల్లో 50 శాతం రిజర్వేషన్లు మేమే తెచ్చాం

విద్యాహక్కు చట్టం అమలు చేయకపోవడంపై హైకోర్టు గుస్సా..

ఎక్కడోళ్లకు అక్కడ్నే పరీక్షలు.. వర్సిటీల మధ్య కుదిరిన ఒప్పందం