స్మార్ట్ ఫోన్ లో ఉన్న డేటా చాలా సెన్సిటీవ్.. ఓ 6 అంకెల ఓటీపీతో కోట్లు కొట్టేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. ఈ క్రమంలో మన మొబైల్ ఫోన్ లో ఉన్న డేటాని కాపాడుకోవడం చాలా ముఖ్యం. మీ ప్రైవసీ డేటా అంతా లాగేయడానికి యాప్ ఇన్‌స్టాల్ చేసినప్పుడు ఇచ్చిన పర్మింషన్లు చాలు. చాలామంది స్మార్ట్ ఫోన్ యూజర్లు అవసరానికి థార్ట్ పార్టీ యాప్ లను డౌన్లోడ్ చేసుకుంటారు. ఆ యాప్ ప్రమాదం అని తెలిశాక అన్ ఇన్స్టాల్ చేసి సేఫ్ అనుకుంటారు. యాప్ ఇన్ స్టాల్ చేసినప్పిటికి ఒక్కసారి మీరు ఇచ్చిన పర్మిషన్స్ తో డేటా చోరి చేయవచ్చు. అలా జరగకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
మన లైఫ్ స్టైల్ లో స్మార్ట్‌ఫోన్ తప్పని సరి అయిపోయింది. ఒకప్పుడు కాల్స్, మెసేజ్‌లు, వినోదానికే మాత్రమే పరిమితమైన ఫోన్స్ ఇప్పుడు డిజిటల్ చెల్లింపులు, బ్యాంకింగ్ కోసం కూడా వాడుతున్నాము. స్మార్ట్‌ఫోన్‌లు డాక్యుమెంట్‌లు, ఫోటోలు, యాప్‌లు, సోషల్ మీడియా డీటెల్స్, లొకేషన్ డేటాతోపాటు పర్సనల్ ఇన్ఫర్మేషన్ కూడా కలిగి ఉంటాయి. అలాంటి ఇన్ఫర్మేషన్ సైబర్ క్రిమినల్స్ చేతుల్లోకి వెళ్తే మీ పని అయిపోయినట్లే. బ్లాక్ మెయిలింగ్, అకౌంట్లో డబ్బు ఖాళీ చేయడం, చీటింగ్ వంటి నేరాలకు మీరు గురవుతారు. డౌన్లోడ్ చేసిన యాప్స్ కు పర్మిషన్ ఇచ్చి ఉంటే దాన్ని ఓ సారి చెక్ చేసుకోవాలి. ఎందుకంటే అవి మీ జీ మెయిల్ అకౌంట్ తో ఆక్సిస్ చేయబడి ఉంటాయి.
ఈ సింపుల్ స్టెప్స్‌తో అన్‌ఇన్‌స్టాల్ చేసిన యాప్స్ పర్మిషన్లు చెక్ చేసుకోండి.
- మీ స్మార్ట్‌ఫోన్ సెట్టింగ్‌లకు వెళ్లండి.
- గూగుల్ సర్వీస్ పై క్లిక్ చేయండి.
- గూగుల్ అకౌంట్ సెట్ చేయడానికి నావిగేట్ చేసుకోండి.
- అందులో డేటా & ప్రైవసీ ఆప్షన్ ని ఎంచుకోండి.
- కిందకి స్ర్కోల్ చేసి థర్డ్-పార్టీ యాప్‌లు, సర్వీసెస్ పై క్లిక్ చేయండి.
- మెయిల్ తో ఆక్సిస్ చేసిన యాప్స్ అన్ ఇన్ స్టాల్ చేసి ఉంటే యాప్ ల ఎంట్రీ పర్మిషన్లు కనిపిస్తాయి. ఒక్కో యాప్ సెలక్ట్ చేసుకొని చెక్ చేసుకోండి.