టెక్నాలజీ వల్ల ఎన్ని ఉపయోగాలున్నాయో.. దాన్ని మితిమీరిన స్థాయిలో వాడితే కలిగే దుష్ఫలితాలు కూడా అనేకం. ఈ కాలంలో ప్రతీ ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ కామన్ అయిపోయింది. ఎంతలా అంటే మన శరీరంలో అది కూడా ఒక పార్ట్ లా.
చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ప్రతీ ఒక్కరు స్మార్ట్ ఫోన్లను వినియోగిస్తున్నారు. కేవలం మాట్లాడడం కోసమే కాకుండా గేమ్స్ ఆడడం, పాటలు వినడం , సినిమాలు చూడడం,బ్రౌజింగ్ చేయడం.. ఇలా రకరకాలుగా ఫోన్లను వాడుతున్నారు.
అతిగా సెల్ ఫోన్‌లో మాట్లాడడం వల్ల దాన్నుంచి వచ్చే రేడియేషన్ మెదడుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. స్మార్ట్‌ఫోన్‌తో ఎక్కువ సమయం గడపడం వల్ల ఎన్నో మానసిక సమస్యలు ఎదురవుతాయని నిపుణులు చెబుతున్నారు. ఈ సమస్యలన్నింటికి రేడియేషనే కారణం.
మన మొబైల్‌లో ఈ రేడియేషన్ ఎంతుందో SAR (Specific absorption rate ) ద్వారా తెలుసుకోవచ్చు. దీని వల్ల కొంతవరకు సమస్యలు తగ్గించుకోవచ్చు. మొబైల్ లోని రేడియేషన్ చెక్ చేయాలంటే.. మొబైల్‌లో డైలర్ ప్యాడ్ ని ఓపెన్ చేసి (*#07#) అనే కోడ్‌ని టైప్ చేయాలి. అప్పుడు ఆటోమేటిగ్గా మన మొబైల్ లో SAR రేటింగ్ డిస్‌ప్లే అవుతుంది.
ఈ రేటింగ్.. 1.6W/kg కంటే తక్కువగా ఉంటే మన మొబైల్ రేడియేషన్ పరిమిత స్థాయిలో ఉన్నట్లు లెక్క. అంతకంటే ఎక్కువ ఉంటే కాస్త జాగ్రత్త పడాల్సిందే. చాలా ఫొన్లు 0.5 నుంచి 0.6 పరిధిలో ఉన్నప్పటికీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఒక వేళ రేడియేషన్ ఎక్కుగా ఉంటే.. మొబైల్ మాట్లాడుతున్నప్పుడు ఇయర్ ఫోన్ ఉపయోగించడం వల్ల సమస్యను కొంత తగ్గించుకోవచ్చు.