
కాగజ్ నగర్, వెలుగు: మహారాష్ట్ర నుంచి తెలంగాణకు రైళ్లలో గంజాయి, ఇతర మత్తు పదార్థాల అక్రమ రవాణా జరుగుతున్నట్లు అందిన సమాచారం మేరకు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మంగళవారం తనిఖీలు చేశారు. తెలంగాణ–మహారాష్ట్ర బార్డర్గా ఉన్న కాగజ్‌నగర్ రైల్వేస్టేషన్లో మహారాష్ట్ర నుంచి వచ్చే రైళ్లలో విస్తృత తనిఖీలు చేపట్టారు. 20 మంది సిబ్బంది 5 బృందాలుగా ఏర్పడి బోగీల్లో ఉన్న ప్యాసింజర్లు బ్యాగులు, సూట్కేసులు తనిఖీ చేశారు. గంజాయి, ఇతర మత్తు పదార్థాలు రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.