మావోయిస్ట్​ నేత నర్సన్న అంత్యక్రియలు పూర్తి

మావోయిస్ట్​ నేత నర్సన్న అంత్యక్రియలు పూర్తి
  • నర్సయ్యకు నివాళులర్పించిన  గ్రామస్తులు, ప్రజా సంఘాల లీడర్లు

గోదావరిఖని, వెలుగు: గ్రామంలో పెత్తందారులకు వ్యతిరేకంగా పోరాటం చేసి.. తుపాకీతో అడవి బాట పట్టిన పాలకుర్తి మండలం జయ్యారం గ్రామానికి చీమల నర్సన్న ఆలియాస్​ జోగన్న ఛత్తీస్‌‌‌‌గఢ్‌‌‌‌ ఎన్​కౌంటర్​లో మృతి చెందగా, శుక్రవారం స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. ఏప్రిల్‌‌‌‌ 30న జరిగిన ఎన్​కౌంటర్​లో నర్సన్న మృతి చెందగా మూడు రోజులకు ఆయన డెడ్‌‌‌‌బాడీని గ్రామానికి తీసుకువచ్చారు.

పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం గుడిపెల్లి శివారులోనే టెంట్​వేసి అక్కడే మృతదేహంపై అమరవీరుల బంధు మిత్రుల కమిటీ, పౌర హక్కుల సంఘం, విరసం,  తెలంగాణ ప్రజా ఫ్రంట్, రైతు సంఘం ప్రతినిధులతో పాటు ప్రజా సంఘాల లీడర్లు, స్థానిక ఎంపీటీసీ, కుటుంబసభ్యులు, జయ్యారం, గుడిపెల్లి, పుట్నూర్​గ్రామాల ప్రజలు ఎర్రజెండా కప్పి నివాళులర్పించారు.

నర్సయ్యకు జోహార్లు అర్పిస్తూ విప్లవ గీతాలు ఆలపించారు. తర్వాత గుడిపెల్లి నుంచి జయ్యారంలోని శ్మశానవాటిక లో అంత్యక్రియలు పూర్తి చేశారు.