క్యాన్సర్ తో చీమ్స్ డాగ్ మృతి.. విషాదంలో నెటిజన్స్

క్యాన్సర్ తో చీమ్స్ డాగ్ మృతి.. విషాదంలో నెటిజన్స్

సోషల్ మీడియా ద్వారా చీమ్స్ పేరుతో ఫేమస్ అండ్ వైరల్ అయిన బాల్ట్జ్ డాగ్ ఇక లేదు. కొంత కాలంగా క్యాన్సర్ తో పోరాడుతున్న ఈ డాగ్.. థొరాసెంటిసిస్‌కు ఆపరేషన్ చేసిన కొద్ది సేపటికే మరణించింది. ప్రస్తుతం దాని వయసు 11 సంవత్సరాలు కాగా.. రీసెంట్ గా దాని యజమాని ఈ వార్తను షేర్ చేయడంతో నెటిజన్లు విషాదం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. బాల్ట్జ్ తన ఫొటోలు, మీమ్స్ తో ఎప్పటికీ బతికే ఉంటుందని తమకు తాము ఓదార్పునిచ్చుకుంటూ కామెంట్లు పెడుతున్నారు.

గతంలో ఎలాన్ మస్క్ కూడా ఈ బాల్ట్జ్ డాగ్ ఫొటోను ఉపయోగించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 15వ తేదీన ట్విట్టర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కుర్చీలో దీన్ని కూర్చోబెట్టారు. కొత్త సీఈఓ వచ్చాడంటూ అప్పట్లో ప్రచారం చేశారు. అంతే కాదు డోజ్ కాయిన్  కూడా ఈ డాగ్ ఫొటోనే వినియోగిస్తోన్నారంటేనే అర్థం చేసుకోవచ్చు దీనికి ఉన్న విలువ ఏ పాటిదో. 2013 నుంచీ డోజ్ కాయిన్ ఇదే లోగోను కొనసాగిస్తోంది. బాల్ట్జ్ డాగ్ బ్రీడ్.. షిబా ఇను. హంటింగ్ బ్రీడ్‌. జపాన్‌కు చెందిన హంటింగ్ బ్రీడ్ జాగిలం ఇది.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Cheems_Balltze (@balltze)