శ్రీశైలంలో చిరుత కలకలం.. భయంతో పరుగులు పెట్టిన భక్తులు..

ఏపీలో  నంద్యాల జిల్లా శ్రీశైలంలో అర్ధరాత్రి చిరుత  సంచారం కలకలం రేపింది. టోల్గెట్ చెకింగ్ పాయింట్ దగ్గర భక్తులకు చిరుత కనిపించింది.  చిరుత విజువల్స్ ను భక్తులు తమ సెల్ ఫోన్లో వీడియో తీశారు. కుక్కను వేటాడి నోటితో పట్టుకుని ఉన్న చిరుతని చూసి ఒక్కసారి భయపడ్డారు స్థానికులు.

భక్తుల అరుపులు విన్న చిరుత రోడ్డుపై నుంచి అటవీ ప్రాంతంలోకి పారిపోయింది. చిరుత సంచారంతో భక్తులు, ఆ మార్గంలో   ప్రయాణం చేసేవారు అప్రమత్తంగా ఉండాలని అటవీ అధికారులు సూచించారు.