తిరుమల నడకదారిలో పులి : గాలి గోపురం షాపుల దగ్గర సంచారం

తిరుమల నడకదారిలో పులి : గాలి గోపురం షాపుల దగ్గర సంచారం

తిరుమల నడకదారిలో చిరుత పులి సంచారం కలకలం రేపింది. అలిపిరి నడకదారిలో గాలిగోపురం, షాపుల దగ్గర తెల్లవారుజామున ఒంటిగంటకు చిరుత సంచరించినట్లు తెలుస్తోంది.ఈ మేరకు సీసీ కెమెరాలో దృశ్యాలు రికార్డయ్యాయి. చిరుత సంచారంతో నడకదారిలో ఆంక్షలు విధించారు అధికారులు. ఈ క్రమంలో మధ్యాహ్నం 2 గంటల లోపే 12ఏళ్ళ పిల్లలను అనుమతిస్తున్నారు అధికారులు. ఉదయం 5 గంటల నుండి రాత్రి 10 వరకు మాత్రమే నడకదారి గుండా భక్తులను అనుమతిస్తున్నారు అధికారులు. 

రాత్రి 8గంటల తర్వాత నడకదారి మార్గంలో గుంపులుగా కర్రలు, సెక్యూరిటీ సాయంతో మాత్రమే భక్తులను పంపుతున్నారు టీటీడీ అధికారులు. చిరుత పులి సంచారంతో భక్తులు భయబ్రాంతులకు లోనవుతున్నారు. 

నడకదారిలో గలిపురం, షాపుల దగ్గర పులి సంచరిస్తున్న క్రమంలో భక్తులు అప్రమత్తంగా ఉండాలని.. సాధ్యమైనంత వరకు ఎవరూ ఒంటరిగా వెళ్లకూడదని.. మధ్యాహ్నం 2 గంటల తర్వాత చిన్నపిల్లలతో నడకదారి మార్గంలో రాకూడదని హెచ్చరిస్తున్నారు అధికారులు.