కట్టెల కోసం వెళ్లి చిరుత దాడిలో మహిళ మృతి..

ఏపీలో దారుణం చోటు చేసుకుంది. కట్టెల కోసం అడవికి వెళ్లిన మహిళపై చిరుత దాడి చేయటంతో మహిళ మృతి చెందింది.  ప్రకాశం జిల్లాలో నంద్యాల-గిద్దలూరు మార్గంలో ఈ ఘటన జరిగింది.మృతురాలిని పచ్చకర్లకు చెందిన మాజీ సర్పంచ్ మెహరున్నీసాగా గుర్తించారు. చిరుత దాడి చేసిన సమయంలో మెహరున్నీసా గట్టిగా కేకలు వేయటంతో స్థానికులు అడవిలోకి వెళ్లారు.

అయితే ఈలోపే చిరుత ఆమెను చంపి మొండెం ఎత్తుకెళ్లినట్లు తెలుస్తోంది. చిరుత కలకలంతో పరిసర గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఎప్పడు ఏ మూల నుండి చిరుత వస్తుందోనని బిక్కుబిక్కుమంటున్నారు ప్రజలు.