జాతీయ రహదారి పక్కన చిరుతపులి మృత దేహం

ఆదిలాబాద్: గుడిహత్నూరు సమీపంలో జాతీయ రహదారిపై చిరుతపులి మృతి చెందింది. గుర్తు తెలియని వాహనం ఢీ కొని మృతి చెందినట్టు ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. చిరుతపులి రోడ్డు దాటు తుండగా గుర్తు తెలియని వాహనం వేగంగా ఢీకొన్నట్టు తెలుస్తోంది. ఘటన స్థలానికి చేరుకున్న ఫారెస్ట్, పోలీసు అధికారులు చిరుత పులి మృతదేహానికి పోస్టుమార్టం చేయిస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే చిరుతపులి మృతికి స్పష్టమైన కారణం తెలుస్తుందని అధికారులు చెబుతున్నారు. గత కొంత కాలంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పులి సంచారం కలకల రేపుతున్న విషయం తెలిసిందే. ఇద్దరు గిరిజనులు కూడా పులి దాడిలో చనిపోయారు. చనిపోయిన పులి అదేనా లేదా వేరేదా అన్నది తెలియాల్సి ఉంది.