కునో నేషనల్ పార్కులో చిరుతలకు వైద్య పరీక్షలు

కునో నేషనల్ పార్కులో చిరుతలకు వైద్య పరీక్షలు

షియోపూర్ : మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌లో ఆరు చిరుతలకు వైద్య పరీక్షలు ప్రారంభించారు పార్కు అధికారులు. నాలుగు నెలల వ్యవధిలో ఎనిమిది చిరుతలు మరణించడంతో నమీబియా దక్షిణాఫ్రికా నిపుణులు అడవిలో ఉన్న అన్ని జంతువుల ఆరోగ్యాన్ని తనిఖీ చేస్తున్నట్లు కునో నేషనల్ పార్క్ డీఎఫ్‌ఓ  తెలిపారు. వైద్య పరీక్షల  కోసం చిరుతలను పెద్ద ఎన్‌క్లోజర్‌లోకి మార్చారు. ఇన్‌ఫెక్షన్,  రేడియో కాలర్ కారణంగా ఏర్పడిన గాయం కొన్ని చిరుతల మరణానికి కారణం కావచ్చని  తేలడంతో ఆరు చిరుతల రేడియో కాలర్‌లను తొలగించారు. మొత్తం 11 చిరుతలు నేషనల్ పార్క్ ఆవరణలో ఉన్నాయి. ప్రస్తుతం పార్కులో ఆరు మగ, ఐదు ఆడ చిరుతలున్నాయి. 

శనివారం సాయంత్రం నిపుణుల బృందం పావన్ అనే మగచిరుతను పట్టుకొని వైద్య పరీక్షలు నిర్వహించారు. పవన్ పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నట్లు తేలింది. అయితే తదుపరి వైద్య పరీక్షలు కోసం బహిరంగ అడవి ఎన్క్లోజర్కు తరలించారు. కునో నేషనల్ పార్కు పెద్ద ఎన్‌క్లోజర్‌లో 6 మగ, 5 ఆడ కలిపి సహా మొత్తం 11 చిరుతలు నివసిస్తున్నాయని చెబుతున్నారు. మిగిలిన 4 చిరుతలు ఓపెన్ ఫారెస్ట్‌లో ఉన్నాయి. వాటిని కూడా ఒక్కొక్కటిగా పరీక్షించనున్నట్లు తెలిపారు. చిరుత 'పవన్'తో సహా 3 చిరుతల మెడపై గాయం, ఇన్ఫెక్షన్ కారణంగా కునో నేషనల్ పార్క్‌లోని దక్షిణాఫ్రికా, నమీబియా నిపుణుల అభిప్రాయం మేరకు 6 చిరుతల మెడ నుంచి రేడియో కాలర్ ఐడిలు తొలగించబడ్డాయి.

చిరుతల మృతిపై కొన్ని రోజుల క్రితం సుప్రీంకోర్టు ఆందోళన చేసింది. విచారణ సందర్భంగా, రాజకీయాలకు అతీతంగా ఎదగాలని, కొన్ని చిరుతలను కునో నుంచి రాజస్థాన్‌కు తరలించడాన్ని పరిశీలించాలని కోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది.