మెట్‌‌‌‌‌‌‌‌పల్లి అటవీ ప్రాంతంలో చిరుత

మెట్ పల్లి, వెలుగు: మెట్‌‌‌‌‌‌‌‌పల్లి మండలంలోని అటవీ ప్రాంతంలో చిరుత సంచరిస్తున్నట్లు ఫారెస్ట్​ఆఫీసర్లు తెలిపారు. బుధవారం ఏర్రాపూర్ శివారులో చిరుతను చూశామని  గొర్రెల కాపరులు ఫారెస్ట్​ ఆఫీసర్లకు సమాచారమిచ్చారు. మూడు రోజుల కింద సత్తెక్కపల్లి, ఏర్రాపూర్ గ్రామాల సరిహద్దు, ఏర్రాపూర్ తండా ప్రాంతాల్లో చిరుతను చూశామని రైతులు ఫారెస్ట్ ఆఫీసర్లకు సమాచారం ఇచ్చారు.

వారు అక్కడికి చేరుకొని పాదముద్రలను పరిశీలించి చిరుత సంచారాన్ని నిర్ధారించారు. సత్తెక్కపల్లి శివారులోని రైల్వే ట్రాక్ వెంబడి చిరుత సంచరిస్తున్న ఫొటోను కొందరు ఫోటో తీసి ఫారెస్ట్ ఆఫీసర్లకు పంపించారు.  సమీప గ్రామాల ప్రజలు, రైతులు జాగ్రత్తగా ఉండాలని ఫారెస్ట్​ ఆఫీసర్లు అవగాహన కల్పిస్తున్నారు.