తిరుమలలో మరోసారి చిరుత కలకలం రేపింది. గురువారం (జనవరి 30) శిలాతోరణం వద్ద చిరుత సంచరించింది. ఔటర్ రింగు రోడ్డులో సర్వదర్శన క్యూలైన్ అటవీ ప్రాంతంలో భక్తులకు చిరుత కనిపింది. చిరుతను చూసి భక్తులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న టీటీడీ, ఫారెస్ట్ ఆఫీసర్లు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు.
చిరుత సంచారం నేపథ్యంలో భక్తులను అలెర్ట్ చేశారు అధికారులు. సర్వదర్శన క్యూలైన్లోనూ భక్తులను కాసేపు ఆపారు. భక్తులకు కీలక సూచన చేశారు. భక్తులు ఒంటరిగా కాకుండా గుంపులుగా వెళ్లాలని సూచించారు. భయాందోళనకు గురి కావొద్దని.. ఏదైనా ఉంటే వెంటనే అధికారులకు సమాచారం అందించాలన్నారు.