నాగేంద్రపూర్‌‌లో చిరుత కలకలం

నాగేంద్రపూర్‌‌లో చిరుత కలకలం

కోటగిరి, వెలుగు : నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలంలోని నాగేంద్రపూర్ లో చిరుత సంచారం కలకలం సృష్టిస్తోంది. గ్రామంలోని వెనిగళ్ల శ్రీధర్ ఇంటి కాంపౌండ్ లో పెంపుడు కుక్కపై గురువారం రాత్రి చిరుత దాడి చేసింది. కుక్క అరుపులు విన్న కుటుంబీకులు కిటికీ తలుపులు తెరిచి చూడగా, చిరుత కనిపించడంతో హడలెత్తారు. తలుపుల చప్పుడు చేస్తూ గట్టిగా అరవడంతో చిరుత అడవిలోకి పారిపోయింది.

కుక్కకు తీవ్ర రక్తస్రావం జరగడంతో తర్వాత రోజు మృతి చెందింది. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. జాగ్రత్తలు తీసుకోవాలని గ్రామస్తులకు సూచించారు.