కామారెడ్డిలో వాహనం ఢీకొని చిరుత మృతి

కామారెడ్డి: జిల్లాలోని దగ్గి అటవీ ప్రాంతంలోచిరుత మృతి చెందింది. దగ్గి-చాంద్రాయణ పల్లి 44వ జాతీయ రహదారిపై గుర్తుతెలియని వాహనం చిరుతను ఢీకొట్టింది. దీంతో చిరుత అక్కడికక్కడే మృతిచెందింది. చిరుత మృతిని గుర్తించిన స్థానికులు అటవీ శాఖా అధికారుల సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అటవీ శాఖ అధికారులు చిరతు కళేబరాన్ని పోస్ట్ మార్టమ్ కోసం తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.