
కొడంగల్, వెలుగు: వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ మండలం చెల్లాపూర్‌లో చిరుత సంచారం కలకలం రేపింది. గ్రామానికి చెందిన సాయన్న తన పొలం వద్ద కట్టేసిన లేగదూడను బుధవారం ఏదో జంతువు చంపి తినేసింది. చిరుత సంచరించినట్లు జాడలు కనిపించడంతో అటవీ అధికారులకు సమాచారమిచ్చారు. ఫారెస్ట్బీట్ఆఫీసర్ రాము ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పాద ముద్రలను సేకరించి నిర్ధారణ కోసం ఉన్నతాధికారులకు సమాచారమిచ్చారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. పొలం పనులకు ఒంటరిగా వెళ్లొద్దని సూచించారు.