బోనులో చిక్కిన చిరుత

నిజామాబాద్​ జిల్లా నవీపేట్​ మండలం అల్జాపూర్ లో ఫారెస్ట్​ అధికారులు ఏర్పాటు చేసిన బోన్​లో  చిరుత చిక్కింది.  ఐదు రోజుల క్రితం చిరుతను చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఫారెస్ట్​ అధికారులు, పోలీసులు చిరుత అడుగులు గుర్తించి బోను ఏర్పాటు చేశారు. శనివారం రాత్రి చిరుత బోనులో చిక్కింది. ఫారెస్ట్​ అధికారులు చిరుతను హైదరాబాద్​లోని జూపార్క్​కు తరలించారు. ఈ ప్రాంతంలో మరో చిరుత సంచరిస్తోందని గ్రామస్తులు చెబుతున్నారు.