శ్రీశైలంలో చిరుత కలకలం.. అరగంటసేపు డివైడర్ పైనే కూర్చుంది.. 

నంద్యాల జిల్లా శ్రీశైలంలో చిరుత సంచారం కలకలం రేపింది. శ్రీశైలంలోని పాతాళ గంగ మెట్ల మార్గానికి సమీపంలో సంచరించిన చిరుత రోడ్డు డివైడర్ పైనే అర్ధగంట పాటు తిష్ట వేసింది. చిరుత చాలా సేపు డివైడర్ పై కూర్చొని పక్కనే ఉన్న అటవీప్రాంతంలోకి వెళ్ళింది. గతంలోను ఇదే ప్రాంతంలో తిరగడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.

గతంలో కూడా టోల్గెట్ చెకింగ్ పాయింట్ దగ్గర భక్తులకు చిరుత కనిపించింది. చిరుత విజువల్స్ ను భక్తులు తమ సెల్ ఫోన్లో వీడియో తీశారు. కుక్కను వేటాడి నోటితో పట్టుకుని ఉన్న చిరుతని చూసి ఒక్కసారి భయపడ్డారు స్థానికులు. ఈ నేపథ్యంలో స్దానికులు,భక్తులు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేసిన అటవిశాఖ దేవస్థానం అధికారులు