త్వరలో కునోలోని చీతాల విడుదల

త్వరలో కునోలోని చీతాల విడుదల

న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్ కునో నేషనల్‌‌‌‌ పార్క్‌‌‌‌ ఎన్‌‌‌‌క్లోజర్లలో ఏడాదిగా సంరక్షిస్తున్న చీతాలను త్వరలోనే అడవిలోకి విడిచిపెట్టనున్నారు. ఆఫ్రికన్ చీతాలు, వాటి పిల్లలను దశల వారీగా అడవిలోకి వదలాలని కేంద్రం నియమించిన ప్రాజెక్ట్ స్టీరింగ్ కమిటీ శుక్రవారం నిర్ణయించింది. ‘‘స్టీరింగ్ కమిటీ సభ్యులు, ఎన్​టీసీఏ అధికారులు కునోలో క్షేత్రస్థాయిలో పర్యటించారు.

చిరుతలను విడుదల చేసే షెడ్యూల్​పై చర్చించారు. అక్టోబర్​లో వర్షాలు ముగియగా నే చీతాలను.. డిసెంబర్ తర్వాత వాటి పిల్లలు, తల్లులను విడుదల చేస్తాం”అని ఓ అధికారి చెప్పారు.