![అనంతగిరి ఘాట్ రోడ్డులో చిరుత పులి సంచారం](https://static.v6velugu.com/uploads/2025/02/cheeth-in-anantagiri-ghat-road-at-vikarabad-district_Y0EW3MofqQ.jpg)
వికారాబాద్, వెలుగు: వికారాబాద్ జిల్లా అనంతగిరి ఘాట్రోడ్డులో మంగళవారం రాత్రి చిరుత పులి కనిపించింది. అనంతగిరి నుంచి కెరెల్లి గ్రామానికి కొత్తగా సీసీ రోడ్డు వేశారు. ఇటీవల రాకపోకలు ప్రారంభించారు. మంగళవారం రాత్రి కొందరు కారులో కెరెల్లి వైపు వెళ్తుండగా చిరుత పులి కనిపించింది. దీంతో కారును స్లో చేశారు. చూస్తుండగానే పులి రోడ్డు దాటింది. చిరుత పులి కోసం అటవీ సిబ్బంది గాలిస్తున్నట్లు వికారాబాద్జిల్లా అటవీ అధికారి జ్ఞానేశ్వర్ తెలిపారు.