
నవీన్ చంద్ర, షాలినీ వడ్నికట్టి జంటగా నటించిన చిత్రం ‘28 డిగ్రీస్ సెంటీగ్రేడ్’.‘పొలిమేర’ఫేమ్ అనిల్ విశ్వనాథ్ దర్శకత్వంలో రూపొందించిన మొదటి చిత్రమిది. వీరాంజనేయ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సాయి అభిషేక్ నిర్మించారు. ఈనెల 28న సినిమా విడుదల కానుంది. శుక్రవారం ఈ సినిమా నుంచి ‘చెలియా చెలియా..’అంటూ సాగే రొమాంటిక్ సాంగ్‌ను రిలీజ్ చేశారు.
శ్రావణ్ భరద్వాజ్ కంపోజ్ చేసిన ఈ పాటకు కిట్టు విస్సా ప్రగడ మంచి లిరిక్స్ రాయగా, రేవంత్ పాడిన విధానం ఆకట్టుకుంది. ‘నీ నగుమోము కనులారా, చూస్తుంటే క్షణమైనా, కనురెప్ప వాలేనా, నా కనుసైగ నీ వెనకా, వెంటాడే మౌనంగా, వేచిందే నువు రాక, ఊహలలో ఊరిస్తూ, దాగినది చాలుగా, ఊరటగా నా ఎదురు నా జతగా రా, చెలియా చెలియా నిన్ను చూడంగా, చెలియా చెలియా కనులు చాలవుగా..’అంటూ మంచి లవ్ ఫీల్‌తో సాగిన పాటలో నవీన్ చంద్ర, షాలినీ జోడీ ఇంప్రెస్ చేస్తోంది.
ఇదొక ఎమోషనల్ లవ్‌స్టోరీ అని, టెంపరేచర్ కథలో ఎంత కీ రోల్ ప్లే చేస్తుంది అనేది, ఒక డిఫరెంట్ స్క్రీన్ ప్లేతో రూపొందించామని దర్శక నిర్మాతలు తెలియజేశారు. ప్రియదర్శి, హర్ష చెముడు, రాజా రవీంద్ర, అభయ్ బేతిగంటి, దేవియాని శర్మ, సంతోషి శర్మ ఇతర పాత్రలు పోషించారు.