నిజామాబాద్, వెలుగు: జిల్లా పబ్లిక్ రిలేషన్(డీపీఆర్వో) ఆఫీస్‌లో డిప్యూటీ ఎగ్జిక్యూటీవ్ ఇన్ఫర్మేషన్ఇంజినీర్ గా పనిచేస్తున్న చెల్లంగి వేణి ప్రసన్న గురువారం లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. కోనేటి విజయ్‌కుమార్ తన కారును డీపీఆర్వో ఆఫీస్‌కు అద్దెకు ఇచ్చారు. మూడు నెలల బిల్లు రూ.99 వేలు ఆయనకు రావాల్సి ఉంది.
బిల్లు మంజూరు చేయాలని విజయ్‌కుమార్ డీఈఐఈచెల్లంగి వేణి ప్రసన్నను కోరగా రూ.9 వేల లంచం డిమాండ్ చేశారు. విషయాన్ని విజయ్‌కుమార్ ఏసీబీ దృష్టికి తీసుకెళ్లారు. నగదు తీసుకుంటున్న ప్రసన్న రెండ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఏసీబీ డీఎస్పీ ఆనంద్‌కుమార్ నేతృత్వంలో సోదాలు నిర్వహించారు. నిందితురాలిని కరీంనగర్ఏసీబీ కోర్టులో హాజరు పరుస్తామని డీఎస్పీ చెప్పారు.c